Bigg Boss 9.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss)తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తిచేసుకుని, సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. అన్ని భాషల కంటే కూడా టాలీవుడ్ లోనే ఈ బిగ్ బాస్ షో కి భారీ క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇకపోతే హాలీవుడ్లో బిగ్ బ్రదర్ గా ప్రారంభమైన ఈ రియాల్టీ షో.. ఇండియాలో బిగ్ బాస్ గా మారి ఆడియన్స్ ను అలరిస్తోంది. దాదాపు పది భాషలలో ఇండియాలో ఈ షో కొనసాగుతున్నట్టు సమాచారం. మొదట హిందీలో స్టార్ట్ అయిన ఈ రియాల్టీ షో.. ఆ తర్వాత కన్నడకు చేరింది. ఇక వెంటనే తెలుగు, మలయాళం, తమిళ్ భాషలలో కూడా ఈ షో చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే కన్నడలో 11 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. సౌత్ లో ఇతర భాషల్లో మాత్రం 8 సీజన్లు పూర్తయ్యాయి.
ఇకపోతే గత ఆరు సీజన్లుగా ఈ బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున (Nagarjuna) తెలుగులో హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ కి ఎన్టీఆర్(NTR ), రెండవ సీజన్ కి నాని (Nani) హోస్ట్గా చేయగా .. మూడవ సీజన్ నుంచి నాగార్జున రంగంలోకి దిగారు. తన మాట తీరుతో అందరినీ కట్టిపడేశారు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 కూడా ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే గత ఆరు సీజన్లుగా బిగ్ బాస్ కి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున హోస్టింగ్ పై కొంతమంది విమర్శలు గుప్పించారు. అయినా ఆయన పట్టించుకోలేదు. అటు బిగ్ బాస్ టీం కూడా అవేవీ లెక్కచేయకుండా ప్రతి సీజన్ కి కొత్తదనం చూపిస్తూ. మార్పులు చేస్తూ నాగార్జుననే కొనసాగిస్తూ వచ్చింది. ఇకపోతే మధ్యలో కొన్ని సీజన్లో ప్రేక్షకులను బోర్ కొట్టించాయి. అందులో భాగంగానే లాస్ట్ సీజన్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెసెంట్ చేసిన బిగ్ బాస్ టీం ఇప్పుడు తెలుగు సీజన్ 9 ని అంతకుమించి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్లో భారీ స్థాయిలో మార్పులు ఉండబోతుండగా సమాచారం.
Kiara Advani – Siddharth Malhotra : తల్లి కాబోతున్న కియరా.. గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్న జంట.!
అందులో మొదటి మార్పు నాగార్జునను హోస్టుగా తప్పించబోతున్నట్లు సమాచారం. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి, నాగార్జున కంటే మించి క్రేజ్ వున్న హీరోలను తీసుకురావాలని చూస్తున్నారట. ఇక అందులో భాగంగానే నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేరు పరిశీలనలో ఉంది. అలాగే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పేరు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఒకరిని ఈ షోకి హోస్టుగా వ్యవహరించేలా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో నిజా నిజాలు తెలిసే వరకు కన్ఫామ్ చేసుకోలేమని బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. ఇక భారీ పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది.. మరి ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.