BigTV English

Allu Arjun Dance: ఆ డ్యాన్స్ మూవ్స్ ఏంటి బన్నీ.. అది ఒళ్లా, విల్లా? ‘గంగోత్రి’కి ముందే..

Allu Arjun Dance: ఆ డ్యాన్స్ మూవ్స్ ఏంటి బన్నీ.. అది ఒళ్లా, విల్లా? ‘గంగోత్రి’కి ముందే..

Allu Arjun Dance: సినీ పరిశ్రమలో బెస్ట్ యాక్టర్ ఎవరు అని మాత్రమే కాదు.. బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అనే చర్చలు కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎప్పటినుండో టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే చాలామంది ప్రేక్షకులు అల్లు అర్జున్ పేరే చెప్పేవారు. వారంతా వేరే హీరోలకు అభిమానులు అయినా కూడా బన్నీ డ్యాన్స్‌కు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ‘గంగోత్రి’ సినిమాతో వెండితెరపై హీరోగా అడుగుపెట్టాడు అల్లు అర్జున్. కానీ తను హీరో అవ్వక ముందే ఒక సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి డ్యాన్స్ ఇరగదీశాడు. ఆ డ్యాన్స్ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.


డ్యాన్స్‌తోనే క్రేజ్

చిరంజీవి హీరోగా నటించిన ‘డాడి’ సినిమాతో మొదటిసారి యాక్టర్‌గా వెండితెరపై వెలిగాడు అల్లు అర్జున్. అందులో చిరంజీవి ఒక డ్యాన్స్ టీచర్‌గా కనిపించగా.. తన ప్రియమైన శిష్యుడిగా బన్నీ నటించాడు. ఇక ఇందులో డ్యాన్సర్ రోల్ కాబట్టి ఒక సీన్‌లో అల్లు అర్జున్ చేసే డ్యాన్స్ చూసి అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా ప్రేక్షకులు షాకవుతున్నారు. ఆ మూవ్స్ చూసి అసలు తను అలా ఎలా చేయగలిగాడు అని చర్చించుకుంటున్నారు. బాడీని విల్లులాగా వంచేసి అవలీలగా డ్యాన్స్ చేసేశాడు అల్లు అర్జున్. ఇప్పటివరకు ఏ హీరో కూడా స్క్రీన్‌పై ఇలా చేయలేదని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


ఆశ్చర్యపరిచే డ్యాన్స్

‘డాడి’లో చిన్న పాత్రతో యాక్టింగ్‌ను మొదలుపెట్టిన తర్వాత రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘గంగోత్రి’తో హీరోగా మారాడు అల్లు అర్జున్. ఈ సినిమా పూర్తిస్థాయి ప్రేమకథగా తెరకెక్కింది. అందుకే ఇందులో అల్లు అర్జన్ (Allu Arjun) డ్యాన్సింగ్ టాలెంట్‌ను చూపించే అవకాశం పెద్దగా రాలేదు. అయినా కూడా డ్యూయెట్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడు ఈ హీరో. ఆ తర్వాత తన ప్రతీ సినిమాలో ప్రేక్షకులు ఆశ్చర్యపోయే రీతిలో డ్యాన్సులు చేస్తూ అందరినీ మెప్పించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ప్రతీ మూవీలో ఆడియన్స్ మర్చిపోలేని ఒక డ్యాన్స్ నెంబర్ ఉండడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది.

Also Read: ప్రభాస్‌ను భయపెట్టే ఏకైక నటుడు ఎవరో తెలుసా.?

పాన్ ఇండియా స్టార్

అల్లు అర్జున్ తర్వాత చాలామంది హీరోలు కూడా తనలాగా డ్యాన్స్ చేయాలని ఆన్ స్క్రీన్ తమ డ్యాన్స్‌తో ఆకట్టుకోవడం మొదలుపెట్టారు. అలా డ్యాన్స్‌తో మాత్రమే కాకుండా ప్రతీ సినిమాకు తన యాక్టింగ్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ఫ’ సినిమా తర్వాత బన్నీకి దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగిపోయింది. ఇక ‘పుష్ప 2’ తర్వాత ఆ క్రేజ్ మరింత పెరిగింది. అలా ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా పాపులారిటీతో, ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతున్నాడని తన ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×