BigTV English

Wine: రెడ్ వైన్ vs వైట్ వైన్ – ఏది ఆరోగ్యానికి మంచిది?

Wine: రెడ్ వైన్ vs వైట్ వైన్ – ఏది ఆరోగ్యానికి మంచిది?

Wine: పండగలు, పెళ్లిలు, పార్టీలలో నలుగురు కలిసినప్పుడు తప్పకుండా వైన్ తాగుతారు. దీన్ని తాగేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. ముఖ్యంగా, రెడ్ వైన్, వైట్ వైన్ బాగా ఫేమస్. అయితే, ఆరోగ్య పరంగా ఈ రెండింటి మధ్య ఎలాంటి తేడాలు ఉంటాయి? రెడ్ వైన్ మంచిదా, లేక వైట్ వైన్ మేలా? వీటి వల్ల కలిగే లాభాలు ఏంటి, ఏది తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


రెడ్ వైన్:
రెడ్ వైన్‌ను తయారు చేసేటప్పుడు వాడే పదార్థాల వల్ల దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రెడ్ వైన్‌ను తయారు చేసే సమయంలో ద్రాక్ష గింజలు, పండ్ల తొనలను కూడా పేసి తాయారు చేస్తారట. దీని వల్ల రెడ్ వైన్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, రిస్వెరాట్రోల్ అధికంగా ఉంటాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని సెల్స్‌ను రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయట. రెడ్ వైన్‌లోని రిస్వెరాట్రోల్ గుండె సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడ్ వైన్ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుందట. ఇది గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ వైన్ సహాయపడుతుందట. తరచుగా రెడ్ వైన్ తాగడం వల్ల మెమరీ పవర్ పెరగుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.


వైట్ వైన్:
వైట్ వైన్ తయారు చేసే విధానవ రెడ్ వైన్‌కు భిన్నంగా ఉంటుందట. వైట్ వైన్‌ను తయారు చేసే సమయంలో ద్రాక్ష తొక్కలను తొలగించి పండును మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ వైట్ వైన్ తాగడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.

రెడ్ వైన్‌తో పోల్చితే వైట్ వైన్‌లో షుగర్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయట. వైట్ వైన్ మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్ తొలగించడంలో కైడా ఇది సహాయపడుతుందట. అందుకే శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో వైట్ వైన్ సహాయపడుతుందని అంటారు.

ఈ వైన్ తాగడం వల్ల కొన్ని క్యాన్సర్లకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరగుదలను అడ్డుకోవడంలో హెల్ప్ చేస్తాయట.

ఏది మంచిది?
గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ల అధికంగా ఉండడం వల్ల రెడ్ వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ కేలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలని అనుకునే వారికి వైట్ వైన్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అయితే వీటిని మితంగా తీసుకోవడమే మంచిది. అతిగా తీసుకుంటే ఏ వైన్ అయినా ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

వైన్ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. వీటిని మోతాదులోనే తీసుకోవడం మంచిది. ఎక్కువగా తాగితే లివర్ డ్యామేజ్, అధిక బరువు, మధుమేహంతో పాటు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. పురుషులు అయితే రోజుకు 1-2 గ్లాసులు వైన్ తీసుకోవచ్చు. స్త్రీలు రోజుకు 1 గ్లాస్ వైన్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావట. దీని కన్నా ఎక్కువ తాగితే ప్రయోజనాలు పక్కన పెడితే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చున్నట్లే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×