Drinking Water: మీరు నిలబడి నీళ్లు తాగుతున్నారా..? ఆ తాగే నీటిని కూడా ఆదుర్దాగా తాగేస్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో పడిన్నట్టే..! త్వరలోనే మీకు కీళ్లు నొప్పులు రావొచ్చు..? లేదంటే కిడ్నీల సమస్యలు వేధించొచ్చు..? అదీ కాదంటే మరిన్ని రోగాలు మిమ్మల్ని బాధించొచ్చు. అసలు నుంచుని నీళ్లు తాగడం వల్లే వచ్చే అనారోగ్య సమస్యలేంటో..? ఈ కథనంలో తెలుసుకుందాం.
మన తెలుగు నాట పాత సామెత ఒకటి ఉంది. పరుగెత్తి పాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం బెటర్ అని అయితే ఇది సామెత మాత్రమే నిజంగా అయితే పరుగెత్తి పాలు తాగడమే కాదు నిలబడి నీళ్లు కూడా తాగకూడదంటున్నారు ఆహార నిపుణులు. నుంచుని నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం డేంజర్ లో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రతి మనిషి ఆరోగ్యం కాపాడుకోవడానికి రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. వేసవిలో అయితే మరిన్ని ఎక్కువ నీల్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మనుషుల శరీరానికి పోషకాహారం ఎంత అవసరమో పరిశుభ్రమైన నీళ్లు కూడా అంతే ముఖ్యం. మానవ దేహంలో ఎక్కువ శాతం నీటితోనే ఉంటుంది. శరీరంలో ఒక్క శాతం నీరు తక్కువ అయినా మనిషికి దాహం వేస్తుంది. అదే లోటు ఐదు శాతానికి పెరిగితే రక్త నాళాలు సాగిపోతాయని.. దీని వల్ల మనిషి సత్తువ కోల్పోతాడని చెప్తున్నారు. ఇలా మానవదేహంలో నీటి శాతం తగ్గిపోయే కొద్దీ.. ఆ మనిషి మృత్యువుకు దగ్గర అవుతాడని అందుకే బాడీలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
జాయింట్ పెయిన్స్: నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆ ప్రభావం బాడీలోని జాయింట్లపై పడుతుందని అది అర్థరైటీస్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడాల్సి వస్తుందంటున్నారు.
అజీర్ణం: నిలబడి నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఈ అలవాటు వల్ల జీర్ణ సంబందిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నుంచుని నీరు త్రాగినప్పుడు అది నేరుగా జీర్ణాశయంలోకి వెల్లి పోతాయని.. దీనివల్ల కడుపు కింది భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అజీర్ణానికి, కడుపులో వికారానికి కారణమవుతుంది.
కిడ్నీలపై భారం: నిలబడి తాగుతున్నప్పుడు నీళ్లు ఎటువంటి వడపోత లేకుండానే..పొట్ట దిగువ భాగానికి చేరుతాయి. అలా చేరిన నీటిలో మలినాలు ఉంటే ఆ ప్రభావం కిడ్నీల పనితీరుపై పడుతుంది. దీని వల్ల కిడ్నీ, బ్లాడర్లో వ్యర్థాలు పేరుకుపోయి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ కు దారితీస్తాయి. ఒక్కోసారి కిడ్నీలు పర్మినెంట్ గా డామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే మూత్రాశయం, మూత్ర పిండాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది.
శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోగా, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. కడుపులో ఒత్తిడి పడి హెర్నియాకు దారి తీసే ప్రమాదాలున్నాయి. ఇక నిటారుగా నిల్చొని నీళ్లు తాగడం వల్ల వాటిలో ఉండే మినరల్స్, ఎలక్ట్రోలైట్లు, కాలేయానికి, జీర్ణ వ్యవస్థకి చేరుకోవని.. ఆధ్యయనాల్లో తేలింది. నిలబడి నీళ్లు తాగినప్పుడు నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా శరీరంలో ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. ఇక అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు. ఇది ఊపిరితిత్తుల సమస్యకు దారితీస్తుంది. నీళ్లు తాగే సమయంలో కూర్చోని వెన్నెముక నిటారుగా ఉంచి నీరు తాగాలని సూచిస్తున్నారు. దీని వల్ల నీళ్లలోని మినరల్స్ మెదడుకు చేరతాయి. బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్