Honey Chilli Potato: బంగాళాదుంపలతో చేసే వంటకాల్లో హనీ చిల్లీ పొటాటోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తియ్యగా, కారంగా, కాస్త పుల్లగా ఉండే ఈ వంటకం రుచికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే పొటాటో ముక్కలకు తేనె, చిల్లీ సాస్, ఇతర మసాలాల రుచి కలిస్తే అద్భుతంగా ఉంటుంది. రెస్టారెంట్లలో ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసే ఈ హనీ చిల్లీ పొటాటోను మనం కూడా ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ రుచికరమైన స్నాక్‌ను తక్కువ పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు.
బంగాళాదుంపలు – 3 పెద్దవి
కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు
మైదా – 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా
వెల్లుల్లి తరుగు – 1 టేబుల్ స్పూన్
Also Read: అన్‌హెల్దీ అని తినడం మానేశారా? నిజానికి ఈ 5 ఫుడ్స్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు!
పచ్చిమిర్చి – 2
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
టమోటా సాస్ – 2 టేబుల్ స్పూన్లు
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
రెడ్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
తేనె – 2 టేబుల్ స్పూన్లు
చిల్లీ ఫ్లేక్స్ – అర టీస్పూన్
స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా
బంగాళాదుంపలపై తొక్క తీసి పొడవాటి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని నీటిలో వేసి బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంపల్లోని అదనపు పిండి పదార్థం తొలగిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఇందులో బంగాళాదుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చల్లి ముక్కలకు పిండి పట్టేలా కలపాలి.
స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను కొద్దికొద్దిగా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. మరింత క్రిస్పీగా కావాలంటే మరోసారి కొద్దిసేపు వేయించుకోవచ్చు.
ఇప్పుడు మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత టమోటా సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి కలపాలి. చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు వేసి మిశ్రమాన్ని ఉడికించాలి. చివరగా తేనె వేసి బాగా కలపాలి.
ఇప్పుడు వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను ఈ సాస్ మిశ్రమంలో వేసి మంట తగ్గించి కలపాలి. ప్రతి ముక్కకు సాస్ బాగా పట్టిన తర్వాత నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, క్రిస్పీ క్రిస్పీ హనీ చిల్లీ పొటాటో రెడీ అయినట్టే.
Also Read: అరటిపండ్లు Vs ఖర్జూరాలు.. ఉదయం ఖాళీ కడుపుతో వీటిలో ఏది తింటే ఎక్కువ లాభాలో తెలుసా?