Hindi Horror Mystery Movie: హారర్ సినిమాల్లో దెయ్యాలు, వింత శబ్దాల కంటే కొన్ని సందర్భాల్లో మనుషులే చేసే పనులు ఎక్కువగా భయపెడతాయి. ముఖ్యంగా ఓ తెలియని ప్రదేశంలో చిక్కుకుపోయి, అక్కడి వాళ్లను నమ్మాలో వద్దో తెలియని పరిస్థితి ఎదురైతే… అలాంటి భయానక పరిస్థితుల చుట్టూ తిరిగే హిందీ హారర్ మూవీ ‘ఝాడ్ ఫూంక్’ (Jhaad Phoonk). తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, చేతబడులు, అతీంద్రియ సంఘటనలు వంటి ఇంట్రస్టింగ్ అంశాలతో సాగుతుంది. మరి హారర్ మూవీ లవర్స్ ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
గర్భిణిగా ఉన్న ఆస్థ తన భర్త రాజ్‌వీర్ తో కలిసి ఢిల్లీకి ప్రయాణమవుతుంది. దారిలో త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో వాళ్లు దట్టమైన అడవి గుండా వెళ్లే షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆ ప్రయాణంలో అనూహ్యంగా కారు ప్రమాదానికి గురవుతుంది. స్పృహ కోల్పోయిన ఆస్థ కళ్లు తెరిచేసరికి తెలియని ప్రదేశంలో ఉంటుంది. అక్కడ మోహన్, అతని భార్య కామిని, వారి మనవడు మోక్ష్ ఉంటారు. ఈ కుటుంబమే ఆమెకు ఆశ్రయం ఇస్తారు.
మొదట్లో వాళ్లు ఆస్థను జాగ్రత్తగా చూసుకుంటున్నట్టే కనిపిస్తారు. కానీ ఆ ఇంట్లో ఉండటం మొదలు పెట్టిన తర్వాత ఆమెకు వింత సంఘటనలు ఎదురవుతాయి. అర్థంకాని సంఘటనలు, అనుమానాస్పద ప్రవర్తన, చుట్టూ కనిపించే భయానక వాతావరణం ఆమెను కలవర పెడతాయి. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడినందుకు ఊపిరి పీల్చుకునేలోపే, తాను మరో ప్రమాదంలో చిక్కుకున్నానేమోనని ఆస్థకు అనిపిస్తుంది.
అసలు మోహన్ కుటుంబం వెనుక ఉన్న రహస్యం ఏంటి ? ఆ ఇంట్లో జరుగుతున్న వింత సంఘటనలకు కారణం ఏమిటి ? తనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లను నమ్మవచ్చా, లేక వాళ్లే ఏదైనా ప్రమాదంలోకి నెట్టబోతున్నారా ? ఆస్థ చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాల వెనుక చేతబడులు, క్షుద్రపూజల పాత్ర ఎంతవరకు ఉంది ? చివరకు గర్భిణిగా ఉన్న ఆస్థ ఈ పరిస్థితుల నుంచి ఎలా బయట పడిందనేది తెరపై చూసి తెలుసుకోవలసిన మిగతా కథ.
‘ఝాడ్ ఫూంక్’ అక్టోబర్ 30 నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 113 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఒరిజినల్ హిందీ భాషలో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ రిలీజ్ కాలేదు. సుంబుల్ తౌకీర్ ఖాన్ (Sumbul Touqeer Khan), పద్మిని కొల్హాపురే (Padmini Kolhapure), హర్ష్ రాజ్‌పుత్ (Harsh Rajput), యశ్‌పాల్ శర్మ (Yashpal Sharma) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాజన్ రాంగోపాల్ వర్మ (Rajan Ramgopal Verma) దర్శకత్వం వహించారు.
Read Also: డిన్నర్ డేట్ కి వెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… ఇంటెన్స్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ