E-Paper
Advertisement

సుప్రీం కోర్ట్ జడ్జీల వరుస హత్యలు… ఒక్క రిపోర్ట్ తెచ్చే తుఫాన్… క్రైమ్ థ్రిల్లర్స్ లోనే మాస్టర్ పీస్ ఈ మూవీ

సుప్రీం కోర్ట్ జడ్జీల వరుస హత్యలు… ఒక్క రిపోర్ట్ తెచ్చే తుఫాన్… క్రైమ్ థ్రిల్లర్స్ లోనే మాస్టర్ పీస్ ఈ మూవీ
Advertisement

Classic Crime Thriller: పాత తరం క్లాసిక్ క్రైమ్ థ్రిల్లర్ల అభిమానులైతే, ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే మీరు ఒక అద్భుతమైన మాస్టర్ పీస్‌ను మిస్ అయినట్టే. హాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ జూలియా రాబర్ట్స్, డెంజెల్ వాషింగ్టన్ కలిసి నటించిన ఎపిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది పెలికాన్ బ్రీఫ్’ (The Pelican Brief). 1993లో రిలీజై వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు సరికొత్తగా ఓ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్ గ్రిషామ్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నావెల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, పొలిటికల్ అండ్ లీగల్ థ్రిల్లర్ జోనర్‌ లోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. మరి ఈ మాస్టర్ పీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో ఉందా ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కథ మొదట్లోనే అమెరికాలో కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు హత్యకు గురవుతారు. ఈ హత్యల వెనుక ఉన్న కారణం ఏమిటో దర్యాప్తు సంస్థలకు కూడా స్పష్టంగా తెలియదు. అదే సమయంలో, న్యాయశాస్త్రం చదువుతున్న డార్బీ షా ఈ రెండు హత్యల గురించి లోతుగా పరిశోధించడం మొదలు పెడుతుంది. హత్యకు గురైన ఇద్దరు జడ్జీల నేపథ్యాన్ని పరిశీలించిన ఆమె, వారి మధ్య ఉన్న కొన్ని పోలికలను గుర్తిస్తుంది. వాటి ఆధారంగా హత్యల వెనుక ఉండవచ్చని భావిస్తున్న కారణాలను వివరిస్తూ ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. అదే ‘ది పెలికాన్ బ్రీఫ్’.

Advertisement

డార్బీ తన ప్రొఫెసర్ థామస్ కలాహన్‌ కు ఈ రిపోర్ట్ చూపిస్తుంది. ఆయన దాన్ని తనకు తెలిసిన ఎఫ్‌బీఐ న్యాయవాది గావిన్ వెరీక్‌ తో పంచుకుంటాడు. అలా డార్బీ పరిశోధన బయటకు వెళ్లడంతో, ఆమె అంచనాలు దేశంలోని శక్తివంతమైన వ్యక్తులకు ప్రమాదకరంగా మారతాయి. ఈ రిపోర్ట్‌ లోని విషయాలు నిజమైతే రాజకీయంగా పెద్ద పరిణామాలు ఎదురవుతాయని కొందరు భావిస్తారు. దీంతో డార్బీ చుట్టూ ప్రమాదం ముసురుకుంటుంది. ఆమెకు దగ్గరైన వ్యక్తులే హత్యకు గురవడంతో, తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని డార్బీ గ్రహిస్తుంది.

ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితిలో, ఈ హత్యలపై సమాచారం సేకరిస్తున్న జర్నలిస్ట్ గ్రే గ్రంథమ్‌ ను సంప్రదిస్తుంది. వీరిద్దరూ కలిసి ఆ రిపోర్ట్‌లోని విషయాలకు ఆధారాలు వెతకడం మొదలుపెడతారు. ఈ క్రమంలో దక్షిణాది ప్రాంతానికి చెందిన చమురు వ్యాపారవేత్త విక్టర్ మాటీస్‌, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న సంస్థ మధ్య ఉన్న వివాదం కీలకంగా మారుతుంది. ఆ వ్యాపారవేత్తకు రాజకీయంగా ఉన్న పరిచయాలు, పర్యావరణానికి సంబంధించిన కేసు, జడ్జీల హత్యలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడ్డాయో తెలుసుకోవడమే డార్బీ, గ్రేల పని. డార్బీ సిద్ధం చేసిన రిపోర్ట్‌లోని అనుమానాలు నిజమని నిరూపించగలరా ? ఆమెను వెంటాడుతున్న హంతకుల నుంచి తప్పించుకుని, ఈ కుట్రను ప్రపంచానికి వెల్లడించగలరా ? రాజకీయ పలుకుబడి, డబ్బు, అధికార బలం మధ్య నిజం ఎలా బయటపడుతుంది ? అన్నది సినిమాలో చూడాల్సిన కథ.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

Advertisement

‘ది పెలికాన్ బ్రీఫ్’ 1993లో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్. నవంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా… ఓటీటీలో ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. హాలీవుడ్ స్టార్‌లు జూలియా రాబర్ట్స్ (Julia Roberts), డెంజెల్ వాషింగ్టన్ (Denzel Washington) కలిసి నటించిన ఈ సినిమాను దర్శకుడు అలన్ జె. పకులా (Alan J. Pakula) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లీడ్ యాక్టర్స్ నటనతో పాటు కథలోని మలుపులు ఈ చిత్రాన్ని క్లాసిక్ పొలిటికల్ థ్రిల్లర్‌గా నిలబెట్టాయి.

Read Also: అరేబియా సముద్రంలో ఆఖరి ప్రయాణం… వెనుక వెంటాడే మిస్టరీ… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

క్రిస్మస్‌ వేళ కుప్పకూలే పరిస్థితుల్లో కుటుంబం… పెంపుడు కుక్క చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యా

కోట్లు నొక్కేసిన కంపెనీ… లాయర్ వేసిన మాస్టర్ ప్లాన్ తో అడ్డం తిరిగే కథ… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా

గర్భిణి చుట్టూ గత్తరలేపే పనులు… చేతబడులు, క్షుద్రపూజలతో వణికించే సైకలాజికల్ హారర్‌ థ్రిల్లర్

అనకాపల్లి గ్యాంగ్‌లో చేరిన కుర్రాడు… గురూజీకే ఎదురు తిరిగితే ? ఓటీటీలోకి వచ్చేసిన ఊరమాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా

OTT Movies : ఓటీటీ లవర్స్ కు పండగే.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సినవి సినిమాలు..!

20 ఏళ్ల క్రితం మాయమైన సోదరుడు… తవ్వేకొద్ది వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు… మైండ్ బెండింగ్ హారర్ మిస్టరీ

సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ది ట్రైటర్స్ నటి శ్రీదేవి!

Big Stories

Advertisement
×