E-Paper
Advertisement

రోహిత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే?

రోహిత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే?
Advertisement

Rohit Naidu Re Entry: తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం ఇటీవల 8 వారాలను ఎంతో ఘనంగా పూర్తి చేసుకుంది. ఎనిమిదవ వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఎనిమిదవ వారంలో భాగంగా సామాన్యులుగా హౌస్ లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ ఝాన్సీ(Jhansi), మరొక కంటెస్టెంట్ రోహిత్ నాయుడు పట్నం(Rohit Naidu Patnam) ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇలా ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా రోహిత్ ఎలిమినేషన్ అనేది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రోహిత్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..

రోహిత్ నాయుడు ఈ రియాలిటీ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఓటింగ్ పరంగా టాప్ వన్ లో దూసుకుపోతున్నారు. అలాంటిది రోహిత్ ఎలిమినేట్ కావడం ఏంటి? ఇది కచ్చితంగా బిగ్ బాస్ వ్యూహంలో భాగంగానే జరిగింది అంటూ అభిమానులు బిగ్ బాస్ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన కొద్ది సమయానికే మరొక ప్రోమో వీడియో సంచలనంగా మారింది. ఇందులో భాగంగా రోహిత్ తిరిగి హౌస్ లోకి రీ ఎంట్రీ (Rohit Re Entry)ఇస్తున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోహిత్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.

మేనల్లుడితో రోహిత్ నాయుడు..

Advertisement

ఈ విధంగా రోహిత్ తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయం తెలియడంతో సంతోషం వ్యక్తం చేసిన అభిమానులకు ఇదొక నిరాశ అని చెప్పాలి. రోహిత్ కళ్లకు గంతులు కట్టుకొని హౌస్ లోకి అడుగుపెట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో నిజమైనది కాదని అది ఏ ఐ ద్వారా సృష్టించబడిన వీడియో అని తెలుస్తుంది. ఇక రోహిత్ ఒకవేళ సీక్రెట్ రూమ్ లో ఉంటే ఆయన బజ్ కార్యక్రమానికి హాజరు కారు. బజ్ కార్యక్రమంలో రోహిత్ పాల్గొనడమే కాకుండా ఆయన ఇంటికి వెళ్లి తన మేనల్లుడితో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

మూవింగ్ ఆన్.. విత్ ఏ హెవీ హార్ట్..

ఇలా తన మేనల్లుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన రోహిత్ మరి కాసేపటికి హౌస్‌లోని జ్ఞాపకాల వీడియోను షేర్ చేస్తూ.. ‘మూవింగ్ ఆన్.. విత్ ఏ హెవీ హార్ట్’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రోహిత్ ఇలాంటి పోస్ట్ చేయటంతో ఈయన తిరిగి హౌస్ లోకి వెళ్లడం లేదని స్పష్టమవుతుంది. ఇక రోహిత్ ఎనిమిది వారాలపాటు హౌస్ లో కొనసాగినందుకు కూడా చాలా తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పాలి. అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వెళ్లడంతో సామాన్యుడిగా ఈయనకు వారానికి 70 వేల రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఇలా 8 వారాలకు గాను రూ.5.6 లక్షల రెమ్యూనరేషన్ అగ్ని పరీక్షలో పాల్గొన్నందుకు అదనంగా 50,000 మొత్తం కలిపి ఆరు లక్షల పదివేల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

Advertisement

Also Read: సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనేనా? పెళ్లి తేదీ ఫిక్స్!

Related News

బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ పై దక్షి రియాక్షన్..ఆ ఒక్క రోజే ప్రశాంతత!

ఘనంగా బుల్లితెర నటి మేఘన లోకేష్ సీమంతపు వేడుక..

ముఖేష్ మరీ ఇంత దిగజారిపోయావా.. దేబ్జానీ కన్నీటికి సమాధానం చెప్పగలవా?

కాళ్ళలో మునుపటి బలం లేదు…కన్నీళ్లు పెట్టుకున్న పండు మాస్టర్!

మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు.. శివ పై వర్షిణి ఫైర్!

Illu Illaalu pillalu : సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భాగ్యం అవుట్..

వర్షిణినీ అవమానించిన త్రిగుణ్.. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడవా

Big Stories

Advertisement
×