BigTV English

Rice Flour Face Pack: మీ ముఖాన్ని మెరిపించే.. బియ్యం పిండి ఫేస్ ప్యాక్

Rice Flour Face Pack: మీ ముఖాన్ని మెరిపించే.. బియ్యం పిండి ఫేస్ ప్యాక్

Rice Flour Face Pack: ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం అనేక రకాల ఫేస్ ప్యాక్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఖరీదైన ఫేస్ ప్యాక్‌లను కొనడానికి బదులుగా బియ్యం పిండితో ఆరోగ్యకరమైన ఫేస్ ప్యాక్‌లను సిద్ధం చేసుకోవచ్చు. బియ్యప్పిండితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా, టాన్ లేకుండా చేస్తుంది.


బియ్యప్పిండిలో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మానికి పోషణను అందిస్తాయి. బియ్యం పిండితో అనేక రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. రైస్ ఫేస్ ప్యాక్ తయారుచేసే విధానం, దాని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:


చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో బియ్యపు పిండి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. రైస్ ఫేస్ ప్యాక్ చర్మానికి ఉపశమనం కలిగించడమే కాకుండా చికాకును తగ్గిస్తుంది. బియ్యపు పిండి చర్మం యొక్క జిడ్డనును పోగొట్టి కాంతివంతం చేస్తుంది. బియ్యప్పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. బియ్యం పిండిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

బియ్యం పిండితో ఫేస్ ప్యాక్స్..

1. బియ్యం పిండి, పెరుగు ఫేస్ ప్యాక్
బియ్యం పిండి- 2 టీస్పూన్లు
పెరుగు-1 టీస్పూన్
నిమ్మరసం – కొద్దిగా

2. బియ్యం పిండి, తేనె ఫేస్ ప్యాక్
బియ్యం పిండి-2 టీస్పూన్లు
తేనె-1 టీస్పూన్
పాలు -కొద్దిగా

3. బియ్యం పిండి, పసుపు ఫేస్ ప్యాక్
బియ్యం పిండి- 2 టీస్పూన్లు
పసుపు- 1/4 టీస్పూన్
రోజ్ వాటర్- కొద్దిగా

4. బియ్యం పిండి, టొమాటో ఫేస్ ప్యాక్
బియ్యం పిండి- 2 స్పూన్లు
టొమాటో యొక్క గుజ్జు- 1స్పూన్
నిమ్మరసం – కొద్దిగా

5. బియ్యప్పిండి, శనగపిండి ఫేస్ ప్యాక్
బియ్యప్పిండి- 2 చెంచాల
శనగపిండి- 1 స్పూన్
పాలు- కొద్దిగా

Also Read: అందంగా కనిపించాలా..? అయితే ఈ ఫేస్ ప్యాక్స్ మీ కోసమే !

ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి ?

ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఏ ఫేస్ ప్యాక్ తయారు చేయాలనుకుంటున్నారో.. ఆ  పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పేస్ట్‌ను ముఖం,మెడపై రాయండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. సమయం ముగిసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

ఇలా ఫేస్ ప్యాక్స్ వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. బియ్యం పిండిలోని పోషకాలు చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తాయి. అంతే కాకుండా ముఖంపై మచ్చలు రాకుండా అడ్డుకుంటాయి. తరుచుగా బియ్యం పిండితో చేసిన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మంపై మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ అందాన్ని రెట్టింపు చేయడానికి దోహదం చేస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×