BigTV English

Dragon Fruit: రక్తం పెరగాలంటే ఎర్ర డ్రాగన్ ఫ్రూట్ తినాలా? మరి తెల్ల డ్రాగన్ పండు తింటే ఏమవుతుంది?

Dragon Fruit: రక్తం పెరగాలంటే ఎర్ర డ్రాగన్ ఫ్రూట్ తినాలా? మరి తెల్ల డ్రాగన్ పండు తింటే ఏమవుతుంది?

డ్రాగన్ ఫ్రూట్ లో రంగురంగుల రకాలు ఉన్నాయి. కొన్ని పండ్లను కట్ చేస్తే లోపల భాగం ఎర్రగా లేదా ముదురు గులాబీ రంగులో ఉంటుంది. మరొక పండు లోపల తెల్లగా ఉంటుంది. అలాగే లోపల పసుపు రంగులో ఉండే డ్రాగన్ పండ్లు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఏది తినడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరమో తెలుసుకోండి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న వారు ఏ రంగు డ్రాగన్ పండును తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారో నిపుణులు వివరిస్తున్నారు.


ఏ రంగు పండు తింటే మంచిది?
నిజానికి రక్తహీనతను ఎదుర్కోవడానికి డ్రాగన్ పండ్లలో ఏ రంగుది తిన్నా ఆరోగ్యకరమే. ఎర్ర డ్రాగన్ పండు, తెల్ల డ్రాగన్ పండు, పసుపు డ్రాగన్ పండు… అన్నీ కూడా రక్తహీనతతో పోరాడేందుకు సహాయపడతాయి. ఎందుకంటే డ్రాగన్ పండులో ఇనుము, విటమిన్ సి అధికంగా ఉంటాయి. వాటి రంగుతో సంబంధం లేకుండానే వాటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ డ్రాగన్ పండును తినడం వల్ల శరీరంలో రక్తకణాలు ఉత్పత్తి పెరుగుతుంది. అయితే ఎర్ర డ్రాగన్ ఫ్రూట్లో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలని కోరుకుంటున్న వారు మాత్రం తెల్ల డ్రాగన్ పండు ఎంచుకోవడం ఉత్తమం.

రక్తహీనత తగ్గుతుంది
రక్తహీనత.. మహిళలు, పిల్లల్లో అధికంగా కనిపించే సమస్య. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి ఎర్ర రక్తకణాలు తగినంతగా ఉండవు. లేదా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల వారికి బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది .అలాంటివారు ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.


డ్రాగన్ ఫ్రూట్ లు తినడం వల్ల కేవలం ఇనుము, విటమిన్ సి మాత్రమే కాదు… ఫోలేట్ కూడా పుష్కలంగా అనిపిస్తుంది. ఇది అన్నీ కలిపి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు రోజుకు ఒక డ్రాగన్ పండు తిన్నా చాలు. లేదా వారంలో మూడు నుంచి నాలుగు డ్రాగన్ పండ్లు తినేందుకు ప్రయత్నించండి. ఇవి మీలో రక్తహీనత సమస్యను చాలా వరకు తగ్గిస్తాయి.

డయాబెటిస్ ఉంటే?
డయాబెటిస్ రోగులు ఎర్ర రంగు డ్రాగన్ ఫ్రూట్ కన్నా లోపల తెల్లగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ని ఎంపిక చేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఎర్ర డ్రాగన్ పండులో చక్కెర అధికంగా ఉంటుంది. తెల్ల డ్రాగన్ పండుతో పోలిస్తే ఎరుపుది తీపిగా ఉంటుంది. అదే తెల్ల డ్రాగన్ ఫ్రూట్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా తెల్ల డ్రాగన్ ఫ్రూట్ ని తినడమే అన్ని రకాలుగా ఉత్తమం.

డ్రాగన్ ఫ్రూట్‌ను నేరుగా తినేస్తే టేస్టీగా ఉంటుంది. లేదా జ్యూస్ గా, స్మూతీస్ గా కూడా చేసుకోవచ్చు. సలాడ్లలో కూడా దీన్ని మీరు భాగం చేసుకోవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్ కాస్త డిఫరెంట్ టేస్ట్ ను ఇస్తుంది. కానీ తినేందుకు మాత్రం రుచిగానే ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తిన్నా ఎలాంటి సమస్య లేదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీన్యూట్రియంట్స్, మన శరీరానికి అత్యవసరమైన విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అయితే ఎర్ర డ్రాగన్ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహులు తెల్ల డ్రాగన్ పండు లేదా పసుపు డ్రాగన్ పండును ఎంచుకోవడం మంచిది. ఇది దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది.

అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి కూడా డ్రాగన్ పండును తినవచ్చు. ఎందుకంటే దీనిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ చాలా వరకు కంట్రోల్ లో ఉండేందుకు సహాయపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ అని ముందే చెప్పుకున్నాము. కాబట్టి గుండె వ్యాధులు రాకుండా ఉండాలనుకునేవారు డ్రాగన్ పండును తినేందుకు ప్రయత్నించాలి.

Related News

Weight Loss After Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గాలా ? ఈ టిప్స్ మీ కోసమే !

Wrinkles: చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలా ?

Khairatabad Ganesh Laddu: ఖైరతాబాద్ లడ్డును ఎందుకు వేలం వేయరు? నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Flax seeds: అవిసె గింజల నూనెతో ఇలా కూడా చేస్తారా! ఉపయోగం ఏమిటి?

Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటున్నారా..? వచ్చే మార్పులు ఇవే!

Mobile Phones: పిల్లల ఆరోగ్యంపై.. మొబైల్ ఫోన్ ప్రభావం ఎంతలా ఉంటుందంటే ?

Big Stories

×