అజంతా ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణ సమయంలోనే అకస్మాత్తుగా నిలిచిపోయింది. మెదక్ జిల్లా అక్కన్నపేటలో ఈ ఘటన జరిగింది. సుమారు 5 గంటల పాటు రైలు ఆగిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు మరో ఇంజిన్ తెప్పించి రైలు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంజిన్ లో సాంకేతిక సమస్యల కారణంగానే ఆగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టెక్నికల్ టీమ్ స్పాట్ కు చేరుకుని బాగు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరో రైలు ఇంజిన్ ను తీసుకొచ్చి రైలును అక్కడి నుంచి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఇంకో రైలును ఇంజిన్ ను తీసుకెళ్తున్నారు.
అక్కన్న పేటలో అంజతా ఎక్స్ ప్రెస్ సుమారు 5 గంటలకు పైగా నిలిచిపోవడంతో రైల్లోని ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. రైలును అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు స్పీడప్ చేశారు. మరికొద్ది సేపట్లో రైలు ప్రయాణం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
ఇక అజంతా ఎక్స్ ప్రెస్ తెలంగాణలోని కాచిగూడ జంక్షన్ నుంచి మహారాష్ట్రలోని మన్మాడ్ జంక్షన్ వరకు ప్రతిరోజు నడుస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే నడిపించే ఈ రైలు.. మరాఠ్వాడ ప్రాంతం, తెలంగాణను కనెక్ట్ చేస్తుంది. మొత్తం 676 కిలో మీటర్ ప్రయాణిస్తుంది. అజంతా గుహల పేరిట దీనికి అజంతా ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారు. ఈ రైల్లో మొత్తం 22 కోచ్ లు ఉంటాయి. AC 2-టైర్, AC 3-టైర్, స్లీపర్, జనరల్, ఫుడ్ ప్యాంట్రీ కార్ కోచ్ లు ఉంటాయి
⦿కాచిగూడ-మన్మాడ్ అంజంతా ఎక్స్ ఎక్స్ ప్రెస్(17063) రైలు ప్రతి రోజు సాయంత్ర 6.25 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు మన్మాడ్ చేరుకుంటుంది.
⦿ మన్మాడ్- కాచిగూడ అంజంతా ఎక్స్ ఎక్స్ ప్రెస్(17064) రైలు ప్రతి మధ్యాహ్నం 1.30 గంటలకు మన్మాడ్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఇక అజంతా ఎక్స్ ప్రెస్ కాచిగూడ, మల్కాజ్ గిరి, కామారెడ్డి, నిజమాబాబ్, ముద్ఖేడ్, నాందేడ్, పర్బణితో పాటు, మన్మాడ్ లో ఆగుతుంది. ఈ రైలు 1990లలో మొదలైంది. ముద్ఖేడ్-సికింద్రాబాద్ లైను మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చిన తర్వాత 2007లో దీని రూట్ మారింది. మొదట్లో వికారాబాద్-పరళి మార్గంలో నడిచింది. ఆ తర్వాత నిజామాబాద్-ముద్ఖేడ్ మార్గానికి మార్చారు. కర్నాటక, తెలంగాణ మధ్య రాకపోకలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Read Also: పండుగ వేళ 973 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్!