OTT Movie : ప్రేమ కథలతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఎన్నో రకాల కథలు ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని కథలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇక లెస్బియన్ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. సొసైటి దీనికి వ్యతిరేకంగానే ఉంటుంది. వీటికి కొన్ని దేశాలలో చట్ట బద్ధత ఉన్నా, మన దేశం ఇంకా ఆస్థాయికి చేరుకోలేదు. ఇప్పుడు మనం చెప్పు కోబోయే ప్రేమకథ, కేరళలో ఒక అందమైన గ్రామంలో ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ప్రేమలో పడి, ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేశారో ఈ కథ చూపిస్తుంది. ఈ మలయాళం సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.
‘Sancharram’ (The Journey) లిగీ జె. పుల్లప్పల్లి దర్శకత్వం వహించిన ఈ మలయాళం రొమాంటిక్ సినిమాలో సుహాసిని వి. నాయర్, శృతి మేనన్, కె.పి.ఎ.సి. లలితా ప్రధాన పాత్రల్లో నటించారు. 110 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, 2004 సెప్టెంబర్ 30న విడుదల అయింది. ప్రస్తుతం Amazon Prime Video, YouTube, plex లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యండిబిలో ఈ సినిమాకి 6.8/10 రేటింగ్ కూడా ఉంది.
కేరళలోని ఒక అందమైన గ్రామంలో కిరణ్, దెలిలా అనే ఇద్దరు యువతులు ఉంటారు. వీళ్ళు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ , కలసి చదువుకుంటారు.అయితే ఆ గ్రామంలో అంజరేజ్డ్ మ్యారేజ్ లు మాత్రమే జరుగుతుంటాయి. లెస్బియన్ ప్రేమ లాంటి వాటికి సొసైటీ ప్లేస్ లేదు. కానీ కిరణ్‌కు దెలిలా మీద ప్రేమ పుడుతుంది. కిరణ్ తన ఫీలింగ్స్‌తో ఆనందంగా ఉన్నా, ఓ వైపు ఈ లెస్బియన్ ప్రేమ మీద భయం కూడా ఉంటుంది. పైగా ఆమె హిందూ ఫ్యామిలీ, దెలిలా ఏమో క్రిస్టియన్. దీంతో ఆమె తన ప్రేమను మనసులోనే దాచుకుంటుంది. వీళ్లు కలిసి కాలేజ్ డేస్ ఎంజాయ్ చేస్తారు. కిరణ్, దెలిలా మధ్య బంధం మరింత పెరుగుతుంది. కానీ కిరణ్ తన ఫీలింగ్స్‌ను చెప్పలేక పోతుంది.
Read Also : ఎనిమీతోనే బెడ్ షేర్ చేసుకునే అరాచకం… అల్టిమేట్ డేర్… ట్విస్టులతో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్
ఈ సమయంలో కిరణ్‌కు ఒక అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. దెలిలా కూడా పెళ్లి ప్రెషర్ ఫేస్ చేస్తుంది. అయితే వీళ్లు కలిసి ఇప్పుడు ఎస్కేప్ ప్లాన్ చేస్తారు. ఒక రోడ్ ట్రిప్‌లో పారిపోతారు. కానీ గ్రామస్తులు వాళ్లను పట్టుకుంటారు. ఇక చేసేదేంలేక కిరణ్ తన ఫీలింగ్స్ ఒప్పుకుంటుంది. వీళ్ల మధ్య ప్రేమ కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఫ్యామిలీ వీళ్ల ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దెలిలా కూడా తన ఫ్యామిలీతో గొడవ పడతుంది. వీళ్లు కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా ? వీళ్ళు కలసి జీవిస్తారా ? ఫ్యామిలీ ప్రెజర్ తో విడిపోతారా ? ఈ కథ ఎండింగ్ ఏమిటి ? అనే విషయాలను, ఈ మలయాళం సినిమాను చూసి తెలుసుకోండి.