OTT Movie : దెయ్యాలు, చేతబడులు, రివేంజ్ లతో హారర్ సినిమాలో వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. గుండె ఉలిక్కి పడేలా చేసే సీన్స్ వీటిలో సాధారణంగానే ఉంటాయి. అయితే కొన్ని సినిమాలలో సీన్స్ మరింత దారుణంగా ఉంటాయి. క్షణక్షణం భయంతో హడలి పోతుంటారు. ఇండోనేషియన్ హారర్ సినిమాలలో ఇలాంటి కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. అక్కడి వాళ్ళు హారర్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. ఇప్పడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా బ్లాక్ మ్యాజిక్ తోనే మొదలవుతుంది. రెండో పెళ్ళాం కావాలనే ఊహ, ఒక ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడేస్తుంది. క్లైమాక్స్ వరకు ఈ సినిమా హడా విడిగానే ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘గునా గునా ఇస్త్రి ముదా’ (Guna guna istri muda) 2024లో వచ్చిన ఇండోనేషియన్ హారర్ మూవీ. రజ్కా రాబ్బీ ఎర్తాంటో దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో అంజస్మారా, లూలు తోబింగ్, కరిస్సా పెరుస్సెట్, హ్యాపీ సల్మా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండోనేషియన్ భాషలో ఉన్న ఈ సినిమా, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది.
బుర్హాన్, వివియాన్ అనే భార్యాభర్తలు సంతోషంగా జీవిస్తుంటారు. వీళ్ళు చాలా ధనవంతులు గా కూడా ఉంటారు. సంతోషంగా ఉన్న వీళ్ళ సంసారం ఒక్క సారిగా తలకిందులు అవుతుంది. బుర్హాన్‌కు ఒక్క భార్య సరిపోక, రెండో భార్య కావాలని అనిపిస్తుంది. అందుకే ఏంజెల్ అనే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఏంజెల్‌కు మాత్రం బుర్హాన్ డబ్బు, ఆస్తి మీదే కన్ను ఉంటుంది. ఆమె సుమి అనే మాంత్రిక మహిళతో కలిసి చేత బడి చేస్తుంది. దీంతో బుర్హాన్, వివియాన్ కుటుంబం ఇబ్బందిలో పడుతుంది. వివియాన్‌కు భయంకరమైన సంఘటనలు మొదలవుతాయి. ఇంట్లో వింత శబ్దాలు వస్తాయి. కథ భయంకరంగా, సస్పెన్స్‌తో సాగుతుంది. ఏంజెల్, సుమి కలిసి బుర్హాన్ కుటుంబాన్ని విడదీయడానికి ప్లాన్ చేస్తారు.
Read Also : 300 కోట్ల దోపిడీ… బిగ్గెస్ట్ రియల్ లైఫ్ దొంగతనం… ‘మనీ హీస్ట్’లాంటి కేక పెట్టించే థ్రిల్లర్
ఈ చేతబడి వల్ల ఏంజెల్ పట్ల బుర్హాన్ ఎక్కువ మక్కువ చూపుతాడు. వివియాన్‌ను నిర్లక్ష్యం చేస్తాడు. వివియాన్, వాళ్ల కొడుకు లియో, ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో భూతాలు, భయంకర సంఘటనలతో భయపడతారు. సుమి చేసిన చేతబడి చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇంట్లో అందరూ గందరగోళంలో పడతారు. వివియాన్ ఈ సమస్యలకు కారణం ఏంజెల్, సుమి అని తెలుసుకుంటుంది. వివియాన్ తన కొడుకు లియో సహాయంతో సుమి, ఏంజెల్‌ల చేతబడిని ఎదుర్కొంటుంది. ఇక క్లైమాక్స్ దద్దరిల్లిపోతుంది. చివరికి ఈ చేతబడి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? ఏంజెల్ ప్లాన్‌ను వర్క్ అవుట్ అవుతుందా ? వివియాన్ దీనికి విరుగుడు కనిపెడుతుందా ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ హారర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.