Prabhas : టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు వినగానే ఫాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి.. ఒకప్పుడు లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఈమధ్య వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఎప్పుడు ఈ హీరో చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం డార్లింగ్ చేతులు ఐదారు సినిమాలు ఉన్నాయి.. ఇవాళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన చేసిన సినిమాలలో సూపర్ హిట్ సినిమాలు.. ఎన్ని కోట్ల ఆస్తులను సంపాదించారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కృష్ణంరాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తున్నాడు.. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతగా మారిపోయిందో వర్ణించడం తక్కువే.. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఐదారు భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ హీరో పేరుతో పాటుగా ఆస్తులు కూడా బాగానే కూడ పెట్టాడు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆయన ఇప్పటివరకు కూడబెట్టిన ఆస్తుల విలువ ఎంతో ఒకసారి తెలుసుకొందాం.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అతని ఆస్తుల విలువ రూ. 350 కోట్లకు చేరింది.. 60 కోట్ల ఇల్లు, ముంబైలో రూ. 10 కోట్ల ఆస్తి, ఇటలీలో ఫ్లాట్ ఉన్నాయి. భీమవరంలో 84 ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉంది.. అలాగే ప్రభాస్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అందులో లంబోర్ఘిని అవెంటేడర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్, జాగ్వార్ XJ కార్లు ఉన్నాయి..
Also Read : ‘మేఘ సందేశం ‘ భూమి అసలు పేరేంటి..? ఒక్కరోజుకు ఎంతంటే..?
బాహుబలి తో పాన్-ఇండియా ట్రెండ్‌ను పరిచయం చేసిన ఘనత ప్రభాస్‌దే.. అందుకే ఆయన్ని అందరూ ఫ్యాన్స్ అందరూ డార్లింగ్ అని పిలుచుకుంటారు. డార్లింగ్ అనే పేరునుంచి పాన్ ఇండియా హీరో అనే పేరుకి ఎదిగాడు. యాక్షన్, రొమాన్స్, కామెడీలో అతనికి మంచి పట్టుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రాజా సాబ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. స్పిరిట్, కల్కి 2, సలార్ 2, ఫౌజీ చిత్రాలు ప్రభాస్ నుంచి రాబోతున్నాయి. అదే విధంగా కొందరు అగ్ర దర్శకులతో ప్రస్తుతం ప్రభాస్ చర్చలు జరుపుతున్నాడు.. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో 3 సినిమాలు తీసేందుకు 450 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు.. ఇక ప్రభాస్ హాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ న్యూస్ కూడా వినబోతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా డార్లింగ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇలానే మరిన్ని భారీ ప్రాజెక్టులలో నటిస్తూ ప్రేక్షకులను అలరించాలని మా బిగ్ టీవీ కోరుకుంటుంది.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్..