Maharashtra News: మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో అమానవీయ ఘటన జరిగింది. బాలికలకు రుతుక్రమం జరిగిందో లేదో తెలుసుకునేందుకు యాజమాన్యం దారుణంగా ప్రవర్తించింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్, నలుగురు ఉపాధ్యాయులు సహా ఎనిమిదిమందిపై కేసు నమోదు అయ్యింది. అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని థానె జిల్లాలో ప్రైవేటు పాఠశాల ఈ ఘటనకు వేదికైంది. స్కూల్‌లో టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండగా రక్తపు మరకలు కనిపించాయి. అక్కడ పనిచేసే సిబ్బంది వాటిని ఫొటోలు తీసి పాఠశాల ప్రిన్సిపల్‌కు చూపించారు. దీనిపై రుసరుసలాడిన ప్రిన్సిపల్, బాలికలకు రుతుక్రమం జరిగిందో లేదో తెలుసుకునేందుకు హాలుకి రప్పించారు.
వారిలో 5 నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలంతా హాజరయ్యారు. సిబ్బంది తీసిన చూపించిన నేలపై రక్తపు మరకల ఫోటోలను ప్రొజెక్టర్ ద్వారా స్క్రీనింగ్ చేసి చూపించారు. పీరియడ్స్‌లో ఉన్నవారు ఒకవైపు.. లేనివారు మరోవైపు విడిపోవాలని ఆదేశించారు. బాలికలను లైన్‌లో నిలబెట్టి వారి అవయవాలను టచ్ చేస్తూ రుతుక్రమంలో ఉన్నారో, లేదో చెక్ చేయించారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా బుధవారం వెలుగులోకి వచ్చింది.
విద్యార్థుణిలను నమ్మని ఆ ప్రిన్సిపల్ మహిళా అటెండెంట్‌ను పిలిపించారు. రుతుక్రమంలో లేమని చెప్పిన విద్యార్థుణిలను చెక్ చేయించారు. వారందరినీ వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి బాలికల వ్యక్తిగత అవయవాలను చెక్ చేసి నిర్దరించారు. ఇంటికెళ్లిన బాలికలు ఈ విషయాన్ని తమ పేరెంట్స్ దృష్టికి తెచ్చారు.
ALSO READ: కూతురు ఎఫైర్‌పై తండ్రి ఆగ్రహం.. దిండు పెట్టి చంపేసి, ఆపై సెకండ్ షో మూవీ
దీంతో ఆగ్రహం గురైన తల్లిదండ్రులు, స్కూల్ ముందు నిరసనకు దిగారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 74, 76, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టంలోని నిబంధనల కింద ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్, అటెండర్, నలుగురు టీచర్లు, ఇద్దరు ట్రస్టీలు మొత్తమ్మీద 8 మందిపై కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్, అటెండర్‌ని అరెస్టు చేశారు. మిగతా సిబ్బందిని విచారిస్తున్నారు.