Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను తిట్టుకుంటూ మనోహరిని స్కూల్‌లో డ్రాప్ చేయమని అడుగుతుంది అమ్ము. దీంతో మనోహరి హ్యాపీగా సరేనంటూ బయటకు కారు దగ్గరకు వెళ్తుంది. అంతా డోరు దగ్గర నుంచుని చూస్తున్న ఆరు బాధపడుతుంది. అమ్ముకు చెప్పాలని ట్రై చేసినా అమ్ముకు వినిపించదు. మిస్సమ్మ బాధపడుతూ కూర్చుంటుంది. ఇంతలో బయటకు కారు దగ్గరకు వెళ్లిన అంజు కోపంగా అమ్మును తిడుతుంది. మిస్సమ్మ మన కోసం ఎన్నో త్యాగాలు చేసింది. అటువంటి మిస్సమ్మను అవమానించడం కరెక్టు కాదని చెప్తుంది. అంజు ఎంత చెప్పినా అమ్ము వినదు. సరికదా అంజును బెదిరించి మనోహరి కారులో స్కూల్‌కు తీసుకెళ్తుంది.
తర్వాత పిల్లలు ఇంటిక వచ్చాక రాత్రికి అందరూ డిన్నర్ చేస్తుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ మిస్సమ్మ వడ్డిస్తుంది. అయితే భోజనం చేస్తున్న అమ్ము లేచి మిస్సమ్మను కాదని మనోహరికి తాను వడ్డిస్తానని చెప్తుంది. అమ్ము మాటలకు అమర్ ఆశ్చర్యపోతాడు. మిస్సమ్మ, రాథోడ్ షాక్ అవుతారు. మనోహరి మాత్రం మనసులో హ్యాపీగా ఫీలవుతుంది. ఇక భోజనం వడ్డించడమే కాదు అమ్ము మనోహరిని ఆకాశానికి ఎత్తేస్తుంది. మనోహరి చాలా మంచిదని.. అమ్మ ప్రేమను మరిపిస్తుందని అమ్మ లేని లోటు మనోహరి ఆంటీ వల్ల తీరిపోతుందని ఏదేదో చెప్తుంది. అమ్ము మాటలకు అమర్ ఇంకాస్త ఆశ్చర్యపోతాడు.
అమ్ముకు తోడు ఆకాష్ కూడా మనోహరిని పొగుడుతాడు. అవును డాడ్.. మనోహరి ఆంటీ చాలా మంచిది.. ఆంటీని చూస్తుంటే.. మాకు అమ్మ లేని లోటు తీరినట్టు అనిపిస్తుంది. తనతో మాట్లాడుతుంటే.. అమ్మతో మాట్లాడినట్టే ఉంటుంది డాడ్.. నిజంగా ఆంటీ చాలా మంచిది డాడ్.. అంటూ ఆకాష్ కూడా మనోహరిని పొగడ్తలతో ముంచెత్తుతాడు. అదంతా గమనిస్తున్న అంజు ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. మిస్సమ్మన తక్కువ చేసి చూస్తూ.. మనోహరిని పొగడటం ఇష్టం లేని అంజు కోపంగా అమ్ము, ఆకాష్ లను తిడుతుంది. ఏం మాట్లాడుతున్నావు ఆకాష్.. అమ్మ స్థానం ఎప్పుడూ మిస్సమ్మదే.. అది ఎవ్వరూ భర్తీ చేయలేరు.. అమ్మ ప్రేమను మిస్సమ్మ పంచినట్టుగా ఎవ్వరూ పంచలేరు.. అది ఎవరి వల్ల కాదు.. ఇంకా చెప్పాలంటే.. మిస్సమ్మే మనకు మరో అమ్మ.. అలాంటి మిస్సమ్మను కాదని ఇంకెవరినైనా పొగిడితే నేను సహించను డాడ్.. అని చెప్తుంది.
అయితే అంజు మాటలకు మనోహరి షాక్ అవుతుంది. ఇదేంటి దీని వల్ల నా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది అని మనసులో అనుకుంటుంది. అమర్ మాత్రం భోజనం చేస్తూ అందరూ చెప్పేది వింటుంటాడు. అయితే పిల్లల మధ్య గొడవ పెరుగుతుందని బావించిన మిస్సమ్మ.. అంజును ఊరుకోమని చెప్తుంది. భోజనం దగ్గర మాటలు ఎందుకు ప్రశాంతంగా తినమని చెప్పగానే.. అంజు కొంచెం కూల్‌గా అది కాదు మిస్సమ్మ.. నీకు మేమంటే ఎంతో ప్రేమ ఉంటుంది. నువ్వు మమ్మల్ని ఎన్నోసార్లు సేవ్ చేశావు.. అదంతా వీళ్లు ఇప్పుడు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.. అంటూ చెప్పగానే.. అంజు అవన్నీ వదిలేయ్ భోజనం చేయ్ అని చెప్తుంది మిస్సమ్మ.
అయితే ఎలాగైనా మిస్సమ్మను అవైడ్ చేయాలని ప్లాన్‌తో ఉన్న అమ్ము వెంటనే తనకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదని నెక్ట్స్ సెమిస్టర్ నుంచి హాస్టల్‌కు వెళ్లిపోతానని అమర్‌కు చెప్తుంది. ఆకాష్ కూడా అమ్ముతో పాటు తాను హాస్టల్ లో ఉంటానంటాడు. దీంతో అమర్ ఎందుకు ఇంత సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? ఇక్కడే ఇంట్లో ఉంటే ఏదైనా ప్రాబ్లమా..? అని అడగ్గానే.. తనకు ఇంట్లో ఉంటే స్టడీస్‌కు డిస్టర్బ్ గా ఉందని.. అందుకే వెళ్తానని అమ్ము చెప్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.