BigTV English

Brahmamudi Serial Today October 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ తో కలిసి ఇంటికి వెళ్లిపోయిన కావ్య

Brahmamudi Serial Today October 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ తో కలిసి ఇంటికి వెళ్లిపోయిన కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: రాజ్‌ నిజం చెప్పినా కావ్య నమ్మదు.. మరో నాటకం ఆడుతున్నావా..? అంటూ నిలదీస్తుంది. ఇంతలో అప్పు లోపలి నుంచి వచ్చి రాజ్‌ చెప్పేది నిజమే అక్కా అని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కళ్యాణ్‌ కూడా అవును వదిన నేను అప్పు మొదటిసారి డాక్టర్‌ గారిని కలవడానికి వెళ్లినప్పుడే మాకు ఈ నిజం తెలిసింది అని చెప్తాడు. బావగారికి నిజం చెప్పేసి మా గుండెల్లో భారాన్ని దించుకున్నాం. కానీ ఆ క్షణం నుంచే నీకు నిజం చెప్పలేక నీ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నరకం అనుభవించారు అని అప్పు చెప్తుంది. నీకు నిజం చెప్పమని అన్నయ్యకు ఎంతో చెప్పాము కానీ నీకు నిజం తెలిస్తే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకే విలువ ఇస్తావని.. నీ ప్రాణాలు కూడా లెక్క చేయవని భయపడ్డాడు.. అని చెప్తాడు కళ్యాణ్‌.


అందుకే అక్కా అందరూ బావగారిని తిడుతున్నా మౌనంగా భరించారు. నిన్ను కాపాడుకోవడం కోసం నీ కడుపులో పెరుగుతున్న తన వారసుడిని కూడా వదిలించుకోవాలనుకున్నాడు అని అప్పు చెప్పగానే.. కావ్య ఏడుస్తూ రాజ్‌ను చూస్తుంది. ఆఖరికి నువ్వు ఇల్లు వదిలేసి వెళ్లిపోయావని తెలిసిన క్షణమే మేము నీకు నిజం చెప్పాలనుకున్నాం. కానీ ఆ క్షణంలో కూడా అన్నయ్య నిన్ను కాపాడటం కోసం అన్నయ్య పడుతున్న తపన చూసి మేము మౌనంగా ఉండిపోయాం.. అంటాడు కళ్యాణ్‌. నువ్వు చెప్పింది కరెక్టే అక్కా బావగారు నిన్ను మోసం చేశారు. నిజం చెప్పకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. జ్యూస్‌లో టాబ్లెట్ కలిపారు. బిడ్డను దూరం చేసుకోమని నిన్ను బాధపెట్టారు. కానీ ఇదంతా చేసింది నీ కోసమే అక్కా నీ ప్రాణాలు కాపాడటం కోసమే.. తనకు వారసులు కావాలని భార్యలను టార్చర్‌ చేసే మగాళ్ల మధ్యలో తన భార్య ప్రాణమే ముఖ్యం అనుకున్న బావగారు బంగారం అక్కా అలాంటి బావను తప్పు పట్టకు ఇలా నిందించి అవమానించకు.. అని ఏడుస్తూ చెప్తుంది అప్పు..

నువ్వు వెళ్తున్న దారి తప్పు అన్నయ్య నువ్వు చేస్తున్న పని వల్ల తన బిడ్డకు దూరం అయితే వదిన నిన్ను జీవితాంతం క్షమించదు ఒక శత్రువులా చూస్తుంది అని చెబితే అన్నయ్య ఏమన్నారో తెలుసా..? వదిన ఓరేయ్‌ అది నన్ను అసహ్యించుకున్నా పర్వాలేదు.. ప్రాణాలతో ఉంటే చాలురా అన్నారు వదిన.. అంటాడు కళ్యాన్‌. ఇప్పుడు కూడా బావ నీకు నిజం చెప్పేవాడే కాదు.. ఆవేశంలో నువ్వు అన్న మాటలకు నోరు జారారే తప్పా.. ఇలా జరగకపోయి ఉంటే నీకు ఎప్పటికీ నిజం చెప్పేవారే కాదు.. నీకు శత్రువులా మారైనా సరే నిన్ను కాపాడుకునే వారు.. అని అప్పు చెప్తుంది. ఒకసారి అన్నయ్యను చూడు వదిన ఇప్పుడు కూడా తను అనుకున్నది జరగలేదని బాధపడటం లేదు.. నోరు జారి నిజం చెప్పేశానే నిన్ను ఎలా కాపాడుకోవాలి అని బాధపడుతున్నాడు అంటూ కళ్యాణ్‌ చెప్పగానే.. సుభాష్‌ దగ్గరకు వచ్చి ఓరేయ్‌ రాజ్‌ కన్న వాళ్లం అయినా కూడా నువ్వేంటో తెలిసి కూడా నిన్ను నిందించాం మమ్మల్ని క్షమించగలవా..? అని అడుగుతాడు.


ఇంద్రాదేవి కూడా బాధగా ఓరేయ్‌ రాజ్‌ నువ్వు మీ తాతయ్య గారికి ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావని బాధపడ్డాను.. కానీ ఈరోజు నా మనవరాలిని కాపాడటానికి నువ్వు అందరి ముందు దోషిగా నిలబడ్డావంటే నాకు ఆగా అర్థం అవుతుందిరా మీ తాతయ్య విలువలను నువ్వు అందనంత ఎత్తుకుకు తీసుకెళ్లి నిలబెట్టావు అంటుంది. ఇక అపర్ణ ఏడుస్తూ.. నేను నానా మాటలు అంటున్నా మనసులో ఇంత బాధ దాచుకని పైకి ఎలా ఉండగలిగావురా..? నీ గొప్ప మనసును తెలుసుకోలేకపోయానురా నన్ను క్షమించరా..? అంటుంది. ఇక సీతారామయ్య కూడా రాజ్‌ను మెచ్చుకుంటాడు. ఇంతలో కావ్య ఏడుస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రూంలో కూర్చుని ఏడుస్తుంది. రాజ్‌ వెళ్లి ఓదారుస్తాడు. ఆవేశంలో తన మనసులోని బాధను కావ్యకు చెప్తూ స్పృహ తప్పి పడిపోతాడు. మరోవైపు రుద్రాణి , రాహుల్ ఇద్దరూ రాజ్‌ ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోలేకపోతారు. ఇక నుంచి బిడ్డను చంపాలనుకున్నాం.. కానీ ఇక నుంచి కావ్యను చంపేద్దాం అని ప్లాన్‌ చేస్తుంది. మరోవైపు ఒంటరిగా బాధపడుతున్న రాజ్‌ను మూర్తి, కనకం వెళ్లి ఓదారుస్తారు. తమను క్షమించమని.. రాజ్‌ను ఎన్నోసార్లు అవమానించామని బాధపడతారు.. రాజ్‌ కాళ్లు పట్టుకోబోతారు రాజ్‌ వద్దని వారిస్తాడు. ఇంతలో కావ్య సూటుకేసుతో  వచ్చి మన ఇంటికి వెళ్దాం పదండి అంటుంది. రాజ్‌, కావ్య ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.

తర్వాత అందరూ హాల్లో ఉండగా కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..కూల్ డ్రింక్ కోసం ఆడాళ్ళ ఫైట్..వల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై చక్రధర్ సీరియస్.. శ్రీయ పెద్ద గొడవ.. అవనికి సపోర్ట్ గా అక్షయ్..

GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్.. కోడళ్లతో ప్రభావతి పూజ.. సత్యం ఇంట దీపావళి సంబరాలు..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today october 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఇంట్లోంచి వెళ్లిపోతానని అమర్‌కు చెప్పిన అమ్ము  

Tv Anchors : హీరోయిన్లను మించి యాంకర్స్ సంపాదన.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?

MeghaSandesham : ‘మేఘ సందేశం ‘ భూమి అసలు పేరేంటి..? ఒక్కరోజుకు ఎంతంటే..?

Big Stories

×