Oils For Long Hair: ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, బలంగా ఉండాలని కోరుకుంటారు కానీ నేటి బిజీ లైఫ్ స్టైల్, కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలడం, సన్నబడటం ఒక సాధారణ విషయంగా మారింది. మీరు కుడా జుట్టు రాలే సమస్యతో ఆందోళన చెందుతుంటే అస్సలు భయపడకండి. జుట్టును ఆరోగ్యంగా, బలంగా మార్చగల 3 అద్భుతమైన జుట్టుకు సంబంధించిన నూనెలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నూనె రాయడం ఎందుకు ప్రయోజనకరం ?
ప్రతి నూనెలో వేర్వేరు పోషకాలు ఉంటాయి. ఒకే నూనెను నిరంతరం ఉపయోగించడం వల్ల జుట్టుకు అవసరమైన అన్ని పోషకాలు లభించవు. ఇలాంటి పరిస్థితిలో మీరు వేర్వేరు నూనెలను ఉపయోగించినప్పుడు, జుట్టుకు విటమిన్లు, ఖనిజాలు , కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇది జుట్టు పెరుగుదల, బలానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
జుట్టు పెరుగుదలకు ఎలాంటి నూనెలు ఉపయోగ పడతాయి :
1. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు ఒక వరం లాంటిది. ఇది ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టును లోపలి నుండి పోషిస్తుంది.
ప్రయోజనాలు:
జుట్టును తేమగా చేస్తుంది. అంతే కాకుండా పొడిబారడాన్ని తొలగిస్తుంది.
చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
వారానికి ఒకసారి.. కొబ్బరి నూనెను తేలికగా వేడి చేసి, రాత్రి పడుకునే ముందు జుట్టు మూలాల నుండి చివరల వరకు బాగా అప్లై చేయండి. ఉదయం షాంపూ వేయండి.
2. ఆలివ్ నూనె:
ఆలివ్ నూనెలో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడానికి ,వాటికి మెరుపును జోడించడానికి సహాయపడతాయి.
ప్రయోజనాలు:
జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
స్ప్లిట్ ఎండ్స్ సమస్యను తగ్గిస్తుంది.
అతినీలలోహిత కిరణాల నుండి జుట్టును రక్షిస్తుంది.
తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎలా ఉపయోగించాలి ?
వచ్చే వారం.. కొబ్బరి నూనెకు బదులుగా ఆలివ్ నూనెను వాడండి. దానిని కొద్దిగా వేడి చేసి, అప్లై చేసి, కనీసం 30 నిమిషాల నుండి 1 గంట వరకు అలాగే ఉంచండి. తర్వాత కడిగేయండి. రాత్రిపూట ఇది మరింత మంచిది.
3. బాదం నూనె:
బాదం నూనె విటమిన్ E, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అంతే కాకుండా జుట్టును మందంగా చేయడంలో సహాయపడుతుంది.
ప్రయోజనాలు:
జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.
జుట్టును మందంగా, బలంగా చేస్తుంది.
తలకు తేమను అందిస్తుంది. అంతే కాకుండా దురదను తగ్గిస్తుంది.
Also Read: కరివేపాకులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
ఎలా ఉపయోగించాలి ?
మూడవ వారంలో బాదం నూనె ఉపయోగించండి. ఇతర నూనెల మాదిరిగానే దీన్ని ఉపయోగించండి. మీకు కావాలంటే.. మీరు దీనికి కొద్దిగా ఆముదం నూనెను కూడా కలుపుకోవచ్చు ఇది జుట్టును మందంగా చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు కుడా మేలు చేస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది