రివ్యూ : బద్మాషులు సినిమా
దర్శకుడు: శంకర్ చేగూరి
నిర్మాతలు: బి. బాలకృష్ణ, సి. రామశంకర్
నటినటులు : మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవితా శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్
సంగీతం: తేజ కునురు
Badmashulu Movie Review : శంకర్ చేగూరి దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు కామెడీ డ్రామా చిత్రం ‘బద్మాషులు’. ఈ సినిమాలో మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవితా శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బి. బాలకృష్ణ, సి. రామశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ తెలంగాణ కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇద్దరు మధ్యవయస్కలైన ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక టైలర్ (మహేష్ చింతల), ఒక బార్బర్ (విద్యాసాగర్ కారంపురి).. వాళ్ళ చిలిపి చేష్టలు, అమాయకపు తప్పులు వారిని ఎన్నో ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. గ్రామంలోని ఒక పోలీస్ కానిస్టేబుల్ (మురళీధర్ గౌడ్) వీళ్ళ పిచ్చి పనులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్‌లు, కామెడీ, నీతి-నిజాయితీ, కష్టపడి పని చేయడం వంటి లైఫ్ లెసన్స్ తో నడుస్తుంది మూవీ. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ చేసే అమాయకపు పనులు వాళ్ళను ఎలాంటి ఇబ్బందుల్లో పడేశాయి? వాటి నుంచి ఎలా బయట పడ్డారు? అనేది తెరపై చూడాల్సిన స్టోరీ.
విశ్లేషణ
ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సహజమైన, ఫీల్-గుడ్ మూవీ ఇది. స్థానిక సంస్కృతి, తెలంగాణ యాస, చిన్న చిన్న సంఘటనలను హాస్యాత్మకంగా చూపించడంలో దర్శకుడు శంకర్ చేగూరి విజయవంతమయ్యాడు. జాతిరత్నాలు, F2 వంటి చిత్రాల స్ఫూర్తితో ఈ సినిమా నవ్వులు పూయిస్తుంది. ఈ చిత్రం కేవలం కామెడీ మాత్రమే కాదు… నీతి, నిజాయితీ, కష్టపడి పనిచేయడం వంటి జీవన విలువలను సున్నితంగా చెప్పారు. బలగం సినిమాను గుర్తుకు తెచ్చే ఈ ఫీల్-గుడ్ కథ. కథలో ఊహించని ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల కథను ముందుగానే ఊహించేలా ఉంది. మరింత డెప్త్ ఉంటే కథ మరింత ఆకర్షణీయంగా ఉండేది.
కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపించవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ నీరసంగా సాగాయి. ఇవి మరింత క్రిస్పీగా ఉంటే బాగుండేది. గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ మొత్తం మీద సాఫీగా ఉన్నప్పటికీ, కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. తేజ కునురు సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్స్ ను, ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ తెలంగాణ గ్రామాల అందమైన దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరించింది. నిర్మాణ విలువలు చిత్రానికి అదనపు బలం.
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి తమ పాత్రలకు జీవం పోశారు. వారి కామెడీ టైమింగ్, సహజసిద్ధమైన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా వారి స్నేహం, చిలిపి డైలాగ్స్ చిత్రానికి సోల్ అని చెప్పవచ్చు. సపోర్టింగ్ యాక్టర్స్ ముఖ్యంగా మురళీధర్ గౌడ్, తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్
నేచురల్ కామెడీ
యాక్టింగ్
సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సన్నివేశాలు
ఎడిటింగ్
మొత్తానికి
తెలంగాణ సంస్కృతి, మాండలికం, విలేజ్ లైఫ్ స్టైల్ ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చుతుంది. కానీ ఇప్పటికే ఇలాంటి సినిమాలంటే మొహం మొత్తిన వారికి ఈ మూవీ బోరింగ్ గా అన్పించవచ్చు.
Badmashulu Movie Rating : 1/5