Manchu Vishnu: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక సినిమా చేసిన కూడా సినిమా ప్రమోషన్స్ కంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక గత కొన్ని రోజులుగా మీ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ ఫ్యామిలీ వివాదాలు అన్నీ కూడా మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రీసెంట్ గా కన్నప్ప సినిమాకు సంబంధించి హార్డ్ డిస్క్ మిస్ అయిన విషయం కూడా వార్తల్లోకి ఎక్కింది. ఇక ప్రస్తుతం కన్నప్ప సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మంచు విష్ణు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. దీని కారణం ఇండియన్ ఇండస్ట్రీలోని స్టార్ యాక్టర్స్ చాలామంది ఈ సినిమాలో నటించడమే. సినిమా ప్రమోషన్స్ లో కూడా మళ్లీ సెల్ఫ్ డబ్బా మొదలుపెట్టారు.
నా అంత అందగాడు దొరకడు
ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసే మంచు విష్ణు ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం తగ్గించిన విషయం తెలిసిందే. ఏదైనా సినిమా చేసిన తర్వాత దాని గురించి ప్రస్తావిస్తూ సినిమా కంటే ఎక్కువగా తన గురించి తాను మాట్లాడుతూ ఉంటాడు. కన్నప్ప సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో కూడా తన భార్య గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్ కూడా చేస్తున్నారు విష్ణు. అయితే విష్ణు భార్య మైసన్ అవా పేరుతో ఒక చిన్న పిల్లల బట్టల షాపును 2022లో స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ గురించి అచీవ్మెంట్ గురించి మాట్లాడుతున్న తరుణంలో, ఒక జర్నలిస్టు మాట్లాడుతూ అందుకనే ఆమెను లవ్ చేశారు అనగానే, నా అంత అందగాడు దొరకడు అని వాళ్లే నన్ను బుట్టలో వేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.
మైసన్ అవా డీటెయిల్స్
పిల్లల యొక్క ఫ్యాషన్ దృష్టిలో పెట్టుకొని విష్ణు భార్య దీనిని మొదలుపెట్టారు. అమెరికాలో పుట్టిన ఆవిడ మంచు విష్ణుని చేసుకున్న తర్వాత ఇండియాకు షిఫ్ట్ అయ్యారు. విరానికా నిత్యం కొత్త కొత్త ఫ్యాషన్స్ తయారు చేస్తూ ఉంటారు. కోవిడ్ దాటిన తర్వాత ఈ ఆలోచన ఆవిడలో మొదలైంది. అవా ఇప్పుడు 14 దేశాలలో ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా 48 లగ్జరీ డిపార్ట్‌మెంట్ స్టోర్లలో అమ్మబడుతుంది. వచ్చే ఏడాది దుబాయ్‌లో దాని మొదటి ఫ్లాగ్‌షిప్ బోటిక్ ప్రారంభం కానుంది. చిన్నపిల్లల నుంచి దాదాపు 16 సంవత్సరాల గల పిల్లల వరకు ఈ స్టోర్ లో బట్టలు దొరుకుతాయి. ఏదేమైనా మంచి విష్ణు సినిమాల్లో అనుకున్న సక్సెస్ సాధించకపోయినా కూడా బిజినెస్ పరంగా తన భార్య చేసిన అచీవ్మెంట్స్ నెక్స్ట్ లెవెల్ అని ఒప్పుకోవాల్సిందే.
Also Read : Nagarjuna Akkineni : పెళ్లి భరాత్ లో నాగచైతన్య, నాగార్జున మాస్ డాన్స్