BigTV English
Advertisement

Home Remedies For Tan: వీటితో ఫేస్‌పై ఉన్న జిడ్డు మాయం

Home Remedies For Tan: వీటితో ఫేస్‌పై ఉన్న జిడ్డు మాయం

Home Remedies For Tan: కాలుష్యం, మారుతున్న వాతావరణం కారణంగా తరచుగా చర్మంపై జిడ్డు పేరుకుపోతుంది. ముఖంపై జిడ్డుకు పేరుకుపోయినప్పుడు నిర్లక్ష్యం చేస్తే కనక చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మొటిమలు వంటివి పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. హోం రెమెడీస్ వల్ల కూడా ముఖం ఎల్లప్పుడూ కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా ఫేస్ పై ముటిమలు, మచ్చలు కూడా రాకుండా ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారు ఈ హోం రెమెడీస్ ట్రై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై ఉన్న ట్యాన్ కూడా తొలగిపోతుంది.


ఈ రోజుల్లో మారుతున్న వాతావరణం కారణంగా చర్మంపై టానింగ్ సమస్య తరచుగా తలెత్తుతోంది. దీనిని వదిలించుకోవడానికి మహిళలు అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయినప్పటికీ ముఖంపై పేరుకుపోయిన జిడ్డు సమస్య తగ్గదు. అటువంటి పరిస్థితిలో ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా ఈ సమస్యను వదిలించుకోవాలనుకుంటే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. స్నానానికి ముందు వీటిని ఉపయోగించడం ద్వారా టానింగ్ నుండి బయటపడవచ్చు.

స్నానానికి ముందు ఈ 4 పనులు చేస్తే ట్యాన్ పోయి చర్మం అందంగా మెరిసిపోతుంది.


టాన్‌ను తొలగించే బెస్ట్ హోం రెమెడీస్:

ముల్తానీ మిట్టి:
ఒక గిన్నెలో 2 స్పూన్ల ముల్తానీ మిట్టిని తీసుకోండి. దీనిలో కాస్త నీరు కలుపుకోండి. దీనిని మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి . ఇలా తయారు చేసిన ఈ ఫేస్ట్ ను స్నానం చేసే ముందు టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ముల్తానీ మిట్టి ఆరిపోయాక చల్లటి నీటితో కడగాలి. ఈ రెమెడీని వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించండి.

ముల్తానీ మిట్టిని ముఖానికి అప్లై చేయడం వల్ల టాన్ నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ముల్తానీ మిట్టిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పెరుగు:
ట్యాన్ ను తొలగించడంలో పెరుగు కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే పెరుగులో క్యాల్షియం, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపును పెరుగుతో కూడా కలిపి ముఖానికి ఉపయోగించవచ్చు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.  ముఖం నిగారింపును సంతరించుకుంటుంది.

Also Read: ఫ్లాక్ సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

పెరుగు, పసుపు :
ఒక గిన్నెలో కాస్త పెరుగు తీసుకుని, అందులో చిటికెడు పసుపు వేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీన్ని మీ ముఖానికి వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించండి. ఇది మీ ముఖంపై ఉన్న టాన్‌ను తొలగిస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని అందంగా మారుస్తుంది. తరుచుగా వీటిని వాడటం వల్ల ముఖం  మెరుస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Fish Fry: సింపుల్‌గా ఫిష్ ఫ్రై.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్

Japanese Gen Z: జపాన్ Gen Z.. సె*క్స్ చేయరట, పాతికేళ్లు వచ్చినా ఆ అనుభవానికి దూరం, ఎందుకంటే?

Neck Pain: మెడ నొప్పా ? ఈ లక్షణాలుంటే.. అస్సలు లైట్ తీసుకోవద్దు !

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Big Stories

×