BigTV English

Simple Makeup: ట్రెండీ లుక్ కోసం.. కాస్త మేకప్ వేద్దామా ?

Simple Makeup: ట్రెండీ లుక్ కోసం.. కాస్త మేకప్ వేద్దామా ?

Simple Makeup: పెళ్లిల్లు, ఫంక్షన్లు పార్టీ ఏదైనా మేకప్ తప్పనిసరి. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు ప్రతి రోజు మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అందరి కంటే కాస్త ట్రెండీగా కనిపించాలంటే.. మేకప్ వేయాల్సిందే అంటుంటారు. ఇదిలా ఉంటే వేసవి కాలంలో మన చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సమయంలో మేకప్ వేసుకున్నా కూడా చెమట, తేమ, బలమైన సూర్యకాంతి కారణంగా.. చర్మంపై త్వరగా చెడిపోతుంది. అందుకే సహజంగా కనిపించడానికి సింపుల్ మేకప్ ట్రై చేయడం మంచిది. మరి సమ్మర్ లోనూ అందంగా కనిపించాలంటే ఎలాంటి మేకప్ టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మేకప్ వేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన దశలు ఉంటాయి. వీటిని అనుసరించడం ద్వారా మీరు మీ మేకప్‌ను పూర్తి చేసుకోవచ్చు. వీటిని ఫాలో అవ్వడం ద్వారా మీరు మీ చర్మానికి తాజాదనాన్ని, మెరుపును అందించవచ్చు.

క్లెన్సర్‌ :
మీ ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకోండి. మేకప్ వేసుకునే ముందు చర్మాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా మీ చర్మం నుండి మురికి, నూనె, మలినాలు ఈజీగా తొలగిపోతాయి. క్లెన్సర్ చర్మం యొక్క pH ని కూడా సమతుల్యం చేస్తుంది. ఇది చర్మ సంబంధిత సమస్యల నుండి కడా దూరంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.


మాయిశ్చరైజర్ :
ముఖానికి మాయిశ్చరైజర్ రాయడం చాలా ముఖ్యం. దీనితో చర్మాన్ని మేకప్ కోసం సిద్ధం చేసుకోవచ్చు. మీ చర్మం పొడిగా ఉంటే క్రీమీ మాయిశ్చరైజర్ రాయండి. ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గించి తేమను అందిస్తుంది.

లిప్ బామ్ :
సింపుల్ మేకప్ అయినా కూడా చర్మంతో పాటు పెదాలను కూడా సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. డ్రై లిప్స్ ఉన్న వారు ఖచ్చితంగా మీ పెదవులపై లిప్ బామ్ రాయండి. మీరు మీ పెదవులపై లిప్‌స్టిక్ వేసుకోవాలనుకుంటే.. బ్రాండెడ్ లిప్ స్టిక్ ట్రై చేయండి. ఇది పెదాలను మృదువుగా ఉంచుతుంది.

ప్రైమర్ వేయండి:
ముందుగా మీరు చర్మంపై ప్రైమర్ అప్లై చేయాలి. దీనివల్ల ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీకు కావాలంటే.. మీరు టింట్ ప్రైమర్ కూడా అప్లై చేయవచ్చు. ఇది మీ చర్మపు రంగును సమం చేస్తుంది. ఇది చర్మాన్ని చాలా సహజంగా కనిపించేలా చేస్తుంది.

బిబి క్రీమ్ రాయండి:
ఇప్పుడు చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలంటే కాస్త.. BB క్రీమ్ అప్లై చేయాలి. మీ ముఖంలోని అన్ని మచ్చలు ,నల్లటి ప్రాంతాలను దాచడానికి BB క్రీమ్ పని చేస్తుంది. దీనివల్ల మీ ముఖం కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

కన్సీలర్ తప్పనిసరి:
మీ ముఖం మీద నల్లటి ప్రాంతాలు, నల్లటి వలయాలు ఉంటే, మీరు కన్సీలర్ వాడాలి. మీరు మీ కళ్ళు, పై పెదవుల చుట్టూ కన్సీలర్‌ను అప్లై చేయండి.అప్పుడే మీ ముఖం మీద ఉన్న మచ్చలు సులభంగా దాగిపోతాయి.

Also Read: ముఖం మిళమిళ మెరిసిపోవాలంటే.. పసుపు ఐస్ క్యూబ్‌లను ఇలా వాడండి !

బ్లష్:
మీరు అందమైన లుక్ పొందాలనుకుంటే.. వీటన్నింటి తర్వాత బ్లష్ అప్లై చేయాలి. బ్లష్ ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. మేకప్ లేని లుక్ కోసం మీరు చాలా తక్కువ బ్లష్ ఉపయోగించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది మాత్రమే మీ మేకప్ సహజంగా కనిపించేలా చేస్తుంది. మీరు పౌడర్ బ్లష్ కు బదులుగా లిక్విడ్ బ్లష్ లేదా టింట్ ఉపయోగించవచ్చు. దీనివల్ల ముఖం చాలా అందంగా కనిపిస్తుంది. ఇవే కాకుండా కాస్త ఐలైనర్ వాడినా కూడా చాలా బాగా కనిపిస్తారు.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×