Pawan Kalyan .. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తొలిసారి తన కొడుకు మార్క్ శంకర్ (Mark Shankar) ఆరోగ్యం పై స్పందించారు. తాజాగా సింగపూర్ నుండి ఈరోజు ఉదయం తన భార్య అన్నా లెజ్నోవా.. కొడుకు మార్క్ శంకర్ తో హైదరాబాద్ కి చేరుకున్న పవన్ కళ్యాణ్ అనంతరం అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం పై కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్.. “నా కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. కోలుకుంటున్నాడు. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన నా కొడుకు కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులు, సినీ , రాజకీయ ప్రముఖులకు కృతజ్ఞతలు చెబుతున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ వేశారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం నిలకడగా ఉంది అని తెలిసి అభిమానులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు.
Following the unfortunate fire incident at my son Mark Shankar’s summer camp in Singapore, I have been overwhelmed by the outpouring of prayers, concern, and support from all-over the world.
I wholeheartedly thank leaders from various political parties, @JanaSenaParty leaders,…
— Pawan Kalyan (@PawanKalyan) April 13, 2025
ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు..
ఇకపోతే పవన్ కళ్యాణ్ మరొక ట్వీట్ లో కీలక ప్రకటన చేశారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నా కృతజ్ఞతలు. సింగపూర్ లో నా కొడుకు మార్క్ శంకర్… వేసవి శిబిరంలో జరిగిన విషాదకరమైన అగ్ని ప్రమాద సంఘటనలో ఇరుక్కున్నప్పుడు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టడంలో మీ ప్రతిస్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమన్వయంతో సింగపూర్ అధికారులు అందించిన సహాయం కష్ట సమయాలలో నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ దుర్ఘటన జరిగినప్పుడు నేను ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతంలో ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో పాల్గొన్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న సమయంలోనే నా కొడుకుకు ఇలా జరగడం నాకు మరింత బాధను కలిగించింది.. ముఖ్యంగా ఈ ఘటనలో నా కొడుకుతో పాటు ప్రభావితమైన ఇతర పిల్లల కోసం కూడా మీరు సకాలంలో జోక్యం చేసుకోవడం మాకు ఉపశమనం కలిగింది. అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.
also read:Pawan Kalyan: ఇకపై మార్క్ శంకర్ బాధ్యత ఆయనదే.. తమ్ముళ్లనే కాదు వారి కొడుకులను కూడా..!
కీలక ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్..
ఇదే ట్వీట్ లో..” దుర్బల గిరిజన సమూహాల జీవితాలను బాగు చేయడానికి, మీరు చేస్తున్న కృషికి, మీ నిబద్ధతకు ‘అడవి తల్లి బాట’ ప్రతిబింబం. ఈ వర్గాల అవసరాలను తీర్చడానికి మీరు తీసుకున్న అనేక చర్యలలో రోడ్డు నిర్మాణం కూడా ఒకటి. ముఖ్యంగా మీరు తీసుకున్న ఈ నిర్ణయం వారి జీవితాలను మార్చడమే కాకుండా వారిని అభివృద్ధి పథం వైపు అడుగులు వేసేలా చేశారు. ముఖ్యంగా PM JANMAN, PMGSY, MGNREGS ల మద్దతుతో ఈ చొరవ తీసుకున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో రూ.1,005 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1,069 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల 601 పీవీటీజీ ఆవాసాలలో కనెక్టివిటీ సమస్యలు కూడా పరిష్కరించవచ్చు. సకాలంలో వైద్య సదుపాయాన్ని అందించవచ్చు. ఇక ఈ సమాజాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాల డోలీ కష్టాలకు కూడా ఇక ముగింపు పలకవచ్చు. ఈ సవాళ్లతో కూడిన సమయంలో కూడా మీరు నా కుటుంబానికి అపారమైన బలాన్ని ఇచ్చారు. మీ ఆలోచనాత్మక , కరుణామయ జోక్యానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తానికైతే గిరిజన ప్రాంతాలలో రోడ్డు నిర్మాణం చేపట్టి డోలీ కష్టాలకు విముక్తి పలకనున్నట్లు పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.
I extend my deepest gratitude to you, Hon'ble Prime Minister Shri @narendramodi ji, and @PMOIndia for the prompt and supportive response during the tragic fire incident at my son Mark Shankar’s summer camp in Singapore. The assistance provided through the Singapore authorities,…
— Pawan Kalyan (@PawanKalyan) April 13, 2025