Turmeric Ice Cubes: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా లేకపోలేదు. బయట మార్కెట్‌లో దొరికే ఫేస్ క్రీములను గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటిని వాడటం వల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలోనే అమ్మాయిలు హోం రెమెడీస్ వాడటం మంచిది. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకునే ఐస్ క్యూబ్స్ చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
తరచుగా ముఖానికి ఐస్ క్యూబ్‌లను వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇదిలా ఉంటే ముఖం కాంతివంతంగా చేయడంలో పసుపు కూడా ఉపయోగపడుతుందని మనందరికీ తెలిసు. పసుపుతో తయారు చేసిన ఐస్ క్యూబ్ కూడా సమ్మర్ లో గ్లోయింగ్ స్కిన్ కోసం అంతే కాకుండా.. ఎండ నుండి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుంది. మరి పసుపు ఐస్ క్యూబ్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు ఐస్ క్యూబ్స్ సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని తక్షణమే ప్రకాశవంతంగా మారుస్తుంది. అంతే కాకుండా రంగు మారిన చర్మాన్ని మునుపటి రంగులోకి మారుస్తుంది. ముఖంపై ఉండే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. చర్మాన్ని కూడా సహజంగా చల్లగా మారుస్తుంది. తక్కువ సమయంలోనే ముఖం మెరిసిపోవాలంటే పసుపు ఐస్ క్యూబ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
పసుపు ఐస్ క్యూబ్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు:
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్యంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా పసుపు ఐస్ క్యూబ్ వాడటం వల్ల చర్మం తక్షణమే మెరిసిపోతుంది. ఇది ముఖ రంధ్రాలను చిన్నగా, బిగుతుగా మారుస్తుంది. వేసవిలో ఇది మీ చర్మం యొక్క అలసటను తగ్గిస్తుంది.
పసుపు ఐస్ క్యూబ్ తయారు చేయడానికి..
కావాల్సిన పదార్థాలు:
పసుపు పొడి- 1 టీ స్పూన్
రోజ్ వాటర్- 1 కప్పు
కలబంద జెల్- 1 టీ స్పూన్
ఐస్ ట్రే- 1
ఎలా తయారు చేయాలి ?
ఒక గిన్నెలో పసుపు , రోజ్ వాటర్ , నీళ్లు తీసుకుని బాగా మిక్స్ చేయండి.
తర్వాత దీనిలో అలోవెరా జెల్ మిక్స్ చేయండి.
అనంతరం ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో నింపండి.
ట్రేని ఫ్రిజ్‌లో ఉంచి రాత్రంతా వదిలేయండి.
ఉదయం ఐస్ ట్రే నుండి ఒక క్యూబ్ తీసుకోండి.
ఇప్పుడు ఐస్ క్యూబ్ ముఖంపై 1-2 నిమిషాల పాటు అప్లై చేయండి.
మొటిమలు, మచ్చలు ఉన్న చోట ఎక్కువ సేపు ఐస్ క్యూబ్ తో రుద్దండి.
అనంతరం 5- 10 నిమిషాలు వదిలేయండి.
అనంతరం గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయండి.
చివరగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
Als0 Read: చిటికెడు కాఫీ పొడితో.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది !
జాగ్రత్తలు:
ఈ ఐస్ క్యూబ్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వారానికి 2- 3 సార్లు మాత్రమే దీనిని ఉపయోగించాలి.
ఎక్కువ సేపు ఐస్ క్యూబ్ తో ముఖాన్ని రుద్దకండి.
సన్నితమైన చర్మం ఉన్న వారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.