Vitamin D: మన శరీరానికి ఇతర పోషకాలతో పాటు విటమిన్ డి కూడా ఎంతో అవసరం. లేదంటే.. ఎముకలు బలహీనపడటం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, అలసట మొదలైన అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా.. ఈ చలికాలంలో జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవాలంటే.. సూర్యరశ్మి మన శరీరానికి చాలా ముఖ్యం. ఈ విటమిన్ డి అనేది సహజంగానే లభిస్తుందనే విషయం తెలిసిందే. అయితే, రోజులో ఏ సమయంలో ఎండలో ఉంటే విటమిన్ డి దొరుకుతుంది? ఎంతసేపు ఎండలో ఉంటే ఆరోగ్యానికి మంచిది.. వంటి ప్రశ్నలకు ఈ కథనం ద్వారా సమాధానం తెలుసుకుందాం.
మన శరీరం మీద సూర్యకిరణాలు నేరుగా పడితేనే విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి.. దీనిని పొందాలంటే సరైన సమయం తప్పనిసరిగా తెలిసుండాలి. విటమిన్ డి సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బాగా అందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఈ సమయంలో UVB కిరణాలు అత్యధికంగా ఉంటాయి. ఇవి మన శరీరం మీద పడినప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుందని సూచిస్తున్నారు. కాబట్టి.. ప్రస్తుతం చలికాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందాలంటే.. ప్రతిరోజూ కాసేపు ఎండలో నిలబడం ఎంతైనా అసవరం.
Read Also: ప్రతిరోజూ సంగీతం వింటే మతిమరుపుకు కళ్లెం.. తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే?
ప్రతిరోజూ విటమిన్ డి పొందడానికి గరిష్టంగా 20 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో కూర్చోవడం లేదా నడవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఎండలో ఉండటం మంచిది కాదని, ఇది చర్మ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తెల్లవారుజామున వచ్చే సూర్యరశ్మి ద్వారా ఎక్కువ విటమిన్ డి పొందవచ్చని అనుకుంటారు. కానీ, చర్మంలోని కొలెస్ట్రాల్‌ను విటమిన్ డి3గా మార్చడానికి ఉపయోగపడే నిర్దిష్ట కిరణాలు, అతినీలలోహిత బి కిరణాలు ఉదయం 7 గంటల వరకు భూమిని చేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక, ఉదయం పూట వచ్చే సూర్యరశ్మి ద్వారా పూర్తిస్థాయిలో విటమిన్ డి అందకపోవచ్చని గ్రహించాలి.