భారత సంతతి వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన అక్కడ కొన్ని రోజులపాటు ఉండి అధ్యయనాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రైతుగా మారారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పంటలను పండిస్తున్నారు. ఆయన అక్కడ పెసర, మెంతుల విత్తనాలు నాటారు. అవి మొలకెత్తిన చిత్రాలను తీసి భూమికి పంపించారు. ఆ విత్తనాలను పరిశోధనలో భాగంగా ఫ్రీజర్ లో ఉంచారు. సూక్ష్మ గురుత్వాకర్షణ అంటే గురుత్వాకర్షణ చాలా తక్కువగా ఉండడం లేదా లేకపోవడం అనేది మొక్కల పెరుగుదలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడమే ఈ పరిశోధన ముఖ్య లక్ష్యం.
అందుకే పెసర, మెంతి విత్తనాలను వేసి అవి ఎలా మొలకెత్తుతాయో లేదో ఎలా ఎంతవరకు పెరుగుతాయో పరిశోధనలు చేస్తున్నారు. అందుకే తాను రైతుగా మారినట్టు చెబుతున్నారు శుభాన్షు శుక్లా.
అంకుటీర్ ప్రయోగం
ఈ ప్రయోగానికి అంకుటీర్ అనే పేరును పెట్టారు. ధార్వాడ్ అగ్రికల్చరల్ సైన్స్ యూనివర్సిటీ ఇండియన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త అయిన సుధీర్ సిద్ధపురెడ్డి ఈ ప్రయోగానికి నాయకత్వం వహిస్తున్నారు. భూమికి తిరిగి శుభాన్షు శుక్లా భూమికి తిరిగి వచ్చిన తర్వాత కొత్త తరాల కోసం విత్తనాలను పెంచుతామని వీరు ప్రకటించారు. వాటి ఆ మొక్కల జన్యు శాస్త్రం, సూక్ష్మజీవుల పర్యావరణ వ్యవస్థ, పోషకాల ప్రొఫైల్ ను లోని మార్పులను పరిశోధిస్తారు. భూమిపై మొలకెత్తిన మొక్కలకు అంతరిక్షంలో మొలకెత్తిన మొక్కలకు ఉన్న తేడాను గమనిస్తారు.
మరొక పరిశోధనలో భాగంగా శుభాన్షు శుక్లా మైక్రో ఆల్గేలను సేకరించారు. ఆహారం, ఆక్సిజన్, జీవ ఇంధనం కోసం దీనిపై పరిశోధనలు జరగబోతున్నాయి. ఇవి సుదీర్ఘ అంతరిక్ష యాత్రలలో మానవులకు ఏ విధంగా సహాయం చేస్తాయో కూడా తెలుసుకోబోతున్నారు.
ఈ మిషన్లో శుభాన్షు ఒక వ్యామగామిగా మాత్రమే కాదు.. ఒక శాస్త్రవేత్తగా, రైతుగా కూడా మారారు. అంతరిక్షంలో మనిషి జీవితాన్ని మెరుగుపరచడానికి ఆయన ఈ ముఖ్యమైన ప్రయోగాలు చేస్తున్నారు. అతను చేస్తున్న ఈ ప్రయోగాలు భవిష్యత్తులో మనిషి అంతరిక్ష ప్రయాణానికి, అంతరిక్షంలో వ్యవసాయానికి కొత్త దిశలను నిర్దేశించవచ్చు.
తిరిగి ఎప్పుడు వస్తారు?
శుభాన్షు శుక్లా… ఆక్సియం 4 మిషన్ లో తన బృందంతో కలిసి అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. మరో రెండు మూడు రోజుల్లో భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే వారు తిరిగి రావడం అనేది ఫ్లోరిడా తీరంలోని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీనిపై నాసా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.