Betting App Promotion: ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు డబ్బులకు కక్కుర్తి పడి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఇలా ప్రమోట్ చేసిన ఈ యాప్స్ ను వారి అభిమానులు డౌన్లోడ్ చేసుకొని.. ఇందులో లక్షలు రూపాయలను పెట్టుబడిగా పెట్టి అప్పుల పాలవుతున్నారు. అయితే ఆ అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ అటు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. మరి కొంతమంది ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక డబ్బుకోసం ఏకంగా తల్లిదండ్రులను, అయిన వాళ్లను, బంధువులను కూడా హతమారుస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తెలుగు సెలబ్రిటీలపై ఐపీఎస్ మండిపాటు.. ట్వీట్ వైరల్
ఈ నేపథ్యంలోనే…ఇలా డబ్బులకు కక్కుర్తి పడి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీళ్లా సెలబ్రిటీలు అంటూ ప్రముఖ ఐపీఎస్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) మండిపడుతూ ఈ మేరకు ఒక ట్వీట్ షేర్ చేశారు. ఆయన తన ట్విట్టర్ వేదికదా.. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వివరాలను షేర్ చేస్తూ.. “సొంత లాభం కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు? సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా బెట్టింగ్ యాప్లకు యువతను బానిసలను చేసి, ఎంతోమంది యువకుల మరణాలకు కారణం అయ్యారు. ముఖ్యంగా మీరు బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలను మరిచి కన్న తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు. దొంగతనాలు చేస్తూ నేరాల బాట పడుతూ.. హంతకులుగా, నేరస్తులుగా మారిపోతున్నారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన మీరు ఈ సమస్యలకు ప్రధాన కారకులు కాదా? ఒక్కసారి ఆలోచించండి.! కాసులకు కక్కుర్తి పడి.. సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సమాజం ఎటు పోతే నాకేంటి అనే మీ ధోరణి సరైంది కాదు” అంటూ మండిపడ్డారు.
సెలబ్రిటీలపై మండిపడుతున్న నెటిజన్స్..
ఇక ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇది సెలబ్రిటీలకు చెప్పు దెబ్బ లాంటిది. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా పనులు చేయండి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కాసులకు కక్కుర్తి పడి.. చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీస్..
ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీస్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామల వంటి మొత్తం 29 మంది సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు , యూట్యూబర్స్ ఉన్నారు. ఇకపోతే ఇప్పటికే వీరిపై కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. ఇక రంగంలోకి దిగిన ఈడీ అధికారులు కూడా ఇప్పుడు మరొకసారి వీరిపై కేసు ఫైల్ చేశారు.
also read:Decade of Baahubali Reign: బాహుబలికి పదేళ్లు… పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ ?
తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్ ను చిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు!?
సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్ లకు బానిసలను చేసి ఎంతో మంది యువకుల మరణాలకు కారణం అయ్యారు.… pic.twitter.com/P8XLDrxIPJ
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 10, 2025