BigTV English
Advertisement

Lulu Mall: లులూ మాల్‌లో యువతిపై అఘాయిత్యం? మేనేజర్ అరెస్ట్

Lulu Mall: లులూ మాల్‌లో యువతిపై అఘాయిత్యం? మేనేజర్ అరెస్ట్

Lulu Mall: కేరళకు చెందిన లులూ మాల్స్, హైపర్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. భారత దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో లులూ మాల్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఒక లులూ మాల్ లో పనిచేసే మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించాడని మాల్ లో సూపర్ వైజర్ పనిచేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళా ఉద్యోగిపై అత్యాచారం చేసి వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్స్ చేస్తున్నాడని అతడిపై ఆ మహిళ ఫిర్యాదు చేసింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్కో నగరంలోని లులూ మాల్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న ఫర్హాజ్ ని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అదే షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి (25) సమీపంలో ఉన్న గోల్ఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయోధ్య లోని ఘోసియానా పహార్ గంజ్ రామ్ నగర్ ప్రాంతానికి చెందిన ఫర్హాజ్ తన ఆఫీసులో పనిచేసే ఒక మహిళా ఉద్యోగితో చనువుగా ఉండేవాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించాడు. తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఆమె అందుకు నిరాకరించగా.. ఉద్యోగ రీత్యా ఒక స్టార్ హోటల్ లో పని ఉందని తీసుకెళ్లి ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు. పైగా తన నీచ చర్యలను వీడియో రికార్డ్ చేశాడు. ఇదంతా ఆమె ఎవరికీ చెప్పకూడదని.. చెబితే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. సిగరెట్ తో కాల్చాడు.

అంతటితో ఆగలేదు. ఆమెను పలు మార్లు ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫర్హాజ్ ని అరెస్ట్ చేశారు. హిందూ యువతి అయిన బాధితురాలిని ఇస్లాం మతంలోకి మారాలని కూడా ఆమెపై ఒత్తిడి చేశాడని పోలీసులు తెలిపారు.


దేశంలో గత కొన్ని వారాలుగా మహిళలపై జరిగే దాడులు, వేధింపుల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని జాతీయ మీడియా రిపోర్ట్. జూన్ 2025లో కూడా న్యాయ విద్య అభ్యసిస్తున్న ఒక మహిళా స్టూడెంట్ సామూహిక అత్యాచారానికి గురైంది. కాలేజీ సమీపంలోనే ఈ ఘోరం జరగడం మరో షాకింగ్ విషయం. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురిలో ఇద్దరు విద్యార్థులు కాగా.. మూడో నిందితుడు టెంపరరీ కాలేజీ స్టాఫర్.

Also Read: భార్యకు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన లాయర్.. ఓపెన్ చేయగానే పోలీసులు వచ్చి

భారతదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు కేసులు ప్లేగు వ్యాధిలా పెరిగిపోతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీ వార్షిక క్రైమ్ రిపోర్ట్ ప్రకారం.. 2024లో ఈ కేసుల సంఖ్య 31,516గా ఉంది. అయితే అందులో నేరం రుజువైన కేసుల సంఖ్య 5,067 మాత్రమే.

Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×