Fig Juice Summer| వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఫలితంగా ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ఇలాంటి సమయంలో నీరు లేదా జ్యూస్ తరుచూ తాగుతూనే ఉండాలి.. ఎండల నుంచి శరీరానికి జరిగే హాని నుంచి కాపాడుకోవడం కోసం ఇది చాలా అవసరం. మంచి నీరు కంటే పోషకాలు ఉన్న జ్యూస్ తాగడం బెటర్. ఉదాహరణకు కొబ్బరి బొండం నీరు, గ్లూకోజ్ వాటర్, తాజా పండ్ల రసం లాంటివి తాగాలి. ఈ జ్యూస్ లు శరీరంలో నీటితోపాటు కావాల్సిన ఎనర్జీ కూడా అందిస్తాయి. ఇవే కాదు వేసవిలో ప్రత్యేకంగా కొన్ని రకాల షర్బత్ డ్రింక్స్ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా అంజీర పండ్ల జ్యూస్ లేదా షర్బత్ తయారు చేసుకొని తాగితే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అంజీర పండుని అందరూ డ్రై ఫ్రూట్ గానే భావిస్తారు. కానీ దీన్ని పండగా కూడా తొనొచ్చు. కావాలంటే దీని జ్యూస్ లేదా షర్బత్ కూడా లాగా చేసుకొని తాగొచ్చు.
శరీరం చల్లగా ఉంటుంది: వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బాడీ హీట్ కూడా బాగా పెరిగిపోతుంది. దీని వల్ల వేసవిలో వడదెబ్బ ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగానే శరీరంలో నీరు తగ్గిపోయి అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యకు నివారించడానికి అంజీర జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. అంజీర జ్యూస్ కడుపుని కూల్ గా ఉంచడంతో పాటు శరీరంలోని ఎలెక్ట్రోలైట్స్ ని తగ్గకుండా కాపాడుతుంది.
ఇన్‌స్టెంట్ ఎనర్జీ: అంజీర్ జ్యూస్ శరీరానికి చల్లదనమే కాదు.. తక్షణ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇందులో నేచురల్ షుగర్ ఉంటుంది. చెరకు రసంలాగా శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది. తద్వారా శరీరంలో బలహీనత, అలసట ఉండదు. అందుకే వేసవిలో అంజీర జ్యూస్ ఒక టానిక్ అని పోషకాహార నిపుణుల అభిప్రాయం.
చర్మ ఆరోగ్యానికి మంచిది: అంజీర జ్యూస్ లో విటమిన్ ఎ, విటమిన్ ఈలతో పాటు యాంటీ ఆక్సిడెంటస్ పుష్కలంగా ఉంటాయి. ఎండలో వెళ్లినప్పుడు చర్మం నల్లబడకుండా, డ్యామేజ్ కాకుండా చర్మానికి కావాల్సిన తగిన పోషణ అందిస్తుంది. ఫలితంగా చర్మం మెరుస్తూ ఉంటుంది.
ఎముకలకు బలం చేకూరుస్తుంది: అంజీర్ లోని కాల్షియం, ఫాస్ పరస్ పోషకాలు ఎముకల ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఇందులో విటమిన్ కె కూడా ఉంటుంది. దీని వల్ల ఎముకలతో పాటు పంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల బలహీనతతో బాధపడేవారు అంజీర పండు తింటే వారి సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుంది.
Also Read: గుండె పోటు నివారణకు ప్రకృతిపరమైన చిట్కాలు.. ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్ క్లీన్
రక్తహీనతకు చెక్: అంజీరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం కూడా అంజీరలో ఉంటాయి. ఇవన్నీ శరీరానికి సరైన మోతాదులో అందడంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది.