Telangana EAPCET 2025: తెలంగాణ నిర్వహించిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారికంగా ప్రకటించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉన్నత విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు.
విద్యార్ధులు అధికారిక వెబ్ సైట్ https://eapcet.tgche.ac.in/ చూడొచ్చు. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి. ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ విభాగంలో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీ పురానికి చెందిన పల్లా భరత్ చంద్ర 150.058 మార్కులతో రాష్ట్ర టాపర్‌గా నిలిచారు.
ఆదివాసీల జిల్లా నుంచి వచ్చిన విద్యార్థి తెలంగాణ టాపర్ గా నిలవడంతో అతనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఉడగండ్ల రామ చరణ్ రెడ్డి 148.284 మార్కులతో రెండో స్థానంలో ఉన్నాడు. అగ్రికల్చర్ విభాగంలో సాకేత్ రెడ్డి పెద్దక్కగారి 141.688 మార్కులతో తొలి స్థానం సాధించాడు. సబ్బాని లలిత్ వరేణ్యా 140.477 మార్కులతో రెండో స్థానంలో నిలిచాడు.
Also Read: వీర జవాన్ ఫ్యామిలీకి అండగా.. 5 ఎకరాల భూమి, 50 లక్షలు, 300 గజాల ఇంటి స్థలం
కాగా.. ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగిన ఎప్ సెట్ అగ్రికల్చర్ విభాగంలో 81, 198 మంది మే 2,3,4 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగానికి 2,07,190 మంది హాజరయ్యారు.