Cult Movie Opening : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ ను విశ్వక్సేన్ ఒకడు. వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియకుండా వెళ్ళిపోయింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమాలో వివేక్ అనే పాత్రలో కనిపించి చాలామందిని విపరీతంగా ఆకర్షించాడు. అప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్న తరుణంలో, దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఫలక్నామా దాస్ అనే సినిమాను తెరకెక్కించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఒకవైపునట్టుగా మరోవైపు దర్శకుడుగా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.
విభిన్నమైన సినిమాలు
విశ్వక్సేన్ విషయానికొస్తే తను ఎంచుకున్న సినిమాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పాలి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. కమర్షియల్ సినిమాతోపాటు గామి లాంటి కాన్సెప్ట్ బే సినిమాలు కూడా చేయటం తన కెరీర్ కు మంచి ప్లస్ అయింది. రీసెంట్ గా లైలా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు విశ్వక్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఇక్కడితో విశ్వక్ మార్కెట్ చాలా వరకు దెబ్బతింది అని చెప్పాలి. ఇప్పుడు దర్శకుడిగా తన మూడవ సినిమాను చేయబోతున్నాడు విశ్వక్సేన్.
Also Read : SamanthaRuthPrabhu : ఐదు వరుస హిట్ సినిమాలు పడగానే నన్ను గోల్డెన్ లెగ్ అన్నారు
కల్ట్ దర్శకుడిగా
దాదాపు ఏడాది క్రితం సే నోటు డ్రగ్స్ అనే స్లోగన్ తో కల్ట్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు విశ్వక్సేన్. ఈ సినిమాను కంప్లీట్ గా కొత్తవాళ్లతో చేయనున్నాడు. నిజజీవితంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకుంటున్నట్లు అప్పట్లో తెలిపాడు. ఈ సినిమాకి కల్ట్ అని టైటిల్ అనౌన్స్ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు సాయి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం నేడు జరిగింది. ఈ ముహూర్తపు పూజకు తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అరవింద్, హారిక హాసిని క్రియేషన్స్ సూర్యదేవర నాగ వంశీ హాజరయ్యారు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో తెలియజేయనున్నారు.
Also Read : Big TV Kissik Talks: యూట్యూబర్స్ పై శివాజీ రాజా ఊహించని కామెంట్స్.. అప్పట్లో ఏం చేసేవారో తెలుసా అంటూ..?