E-Paper
Advertisement

ఎండలో నీళ్లు తాగినా ప్రాణాపాయమా? ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత ఎందుకు ముఖ్యం?

ఎండలో నీళ్లు తాగినా ప్రాణాపాయమా? ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత ఎందుకు ముఖ్యం?
Advertisement

Electrolyte Imbalance: వేసవి కాలం వచ్చిందంటే చాలు, అందరూ చెప్పే మాట “ఎక్కువ నీళ్లు తాగండి” అని. కానీ.. ఈ సలహా సగం మాత్రమే నిజం. ఎందుకంటే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక ఘటన మనల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రోజంతా ఎండలో తిరుగుతూ 5 లీటర్ల నీరు తాగాడు. కానీ ఆహారం తీసుకోలేదు. ఫలితంగా సాయంత్రానికి స్పృహ కోల్పోయి ఐసీయూలో చేరాడు. అతనికి వచ్చిన సమస్య హైపోనాట్రేమియా .

నీరు మాత్రమే తాగితే ఏం జరుగుతుంది?
మనం ఎండలో ఉన్నప్పుడు చెమట రూపంలో కేవలం నీరు మాత్రమే కాదు, సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్య లవణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఇవి మన కండరాలు, నరాలు , గుండె సరిగ్గా పనిచేయడానికి అవసరం. ఆ సమయంలో మనం కేవలం ‘ప్లెయిన్ వాటర్’ మాత్రమే అతిగా తాగితే.. రక్తంలో ఉన్న కొద్దిపాటి సోడియం కూడా పలచబడిపోతుంది. దీని వల్ల మెదడు కణాలలో వాపు వచ్చి ప్రాణాలకే  ప్రమాదం ఏర్పడుతుంది.

Advertisement

ప్రధాన సమస్యలు:
హైపోనాట్రేమియా (సోడియం తగ్గడం): నీరు ఎక్కువై సోడియం తగ్గినప్పుడు తల తిరగడం, వికారం, మాట తడబడటం, ఫిట్స్ వంటివి రావచ్చు.

హైపర్ నాట్రేమియా (నీరు తగ్గడం): అసలు నీరు తాగకపోవడం వల్ల సోడియం గాఢత పెరిగి కణాలు కుచించుకుపోతాయి. ఇది కూడా ప్రమాదకరమే.

Advertisement

పొటాషియం లోపం: చెమట ద్వారా పొటాషియం పోతే కండరాల నొప్పులు, నీరసం , గుండె లయ తప్పడం వంటివి జరుగుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కేవలం నీరు మాత్రమే వద్దు: ఎండలో తిరిగేటప్పుడు నీటితో పాటు ORS (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్), మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తీసుకోవాలి.

ఆహారం : ఖాళీ కడుపుతో ఎండలో తిరగడం అత్యంత ప్రమాదకరం. పండ్లు, ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి లవణాలు అందుతాయి.

లక్షణాలు గమనించండి: తలనొప్పి, నీరసం, అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే.. డాక్టరును సంప్రదించాలి.

గుర్తుంచుకోండి.. వేసవిలో ప్రాణం కాపాడేది కేవలం నీరు మాత్రమే కాదు, నీటితో పాటు  లవణాలు కూడా!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×