BigTV English

Summer Makeup Tips : ఎండకు మీ మేకప్ కరిగిపోతుందా.. ఇలా ట్రై చేసి చూడండి!

Summer Makeup Tips : ఎండకు మీ మేకప్ కరిగిపోతుందా.. ఇలా ట్రై చేసి చూడండి!
Summer Makeup Tips
Summer Makeup Tips

Summer Makeup Tips : శివరాత్రి అలా వెళ్లిందో లేదో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రభావానికి ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా టినెజర్లు ఎండకాలం అందాన్ని ఎలా కాపాడుకోవాలని బెంగపెట్టుకున్నారు. సాధారణంగా చర్మం పట్ల ప్రతి ఒక్కరు కేర్ తీసుకుంటారు. కానీ ఎండకాలం అది కాస్త ఎక్కువగా తీసుకోవాలి. సూర్యుని నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. లేదంటే చర్మంపై ట్యాన్ ఏర్పడుతుంది. అందవిహీనంగా మారిపోతారు.


అయితే తరచూ ఆఫీసులకు వెళ్లేవారు, అందంపై శ్రద్ధ చూపేవారు.. వేసవిలో కూడా మేకప్ వేసుకుంటారు. వేసవిలో చెమటకు మేకప్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నాణ్యత లేని ఉత్పత్తులను ఉపయోగిస్తే, మేకప్ మాత్రమే కాకుండా చర్మం కూడా దెబ్బతింటుంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా బట్టలు, హెయిర్ స్టైల్, మేకప్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాల్సి ఉంటుంది. అవేంటో మీకు తెలియకపోతే ఈ కథనం ద్వారా తెలుసుకోండి.

 

1. జెల్ మాయిశ్చరైజర్


వేసవిలో జెల్ మాయిశ్చరైజర్ ఉపయోగించండి. క్రీము మాయిశ్చరైజర్ కాదు. దీని వల్ల మీ లుక్ చాలా జిడ్డుగా కనిపిస్తుంది. మేకప్ చేయడానికి ముందు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. మొదట మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఆ తర్వాత ఫౌడర్ రాయండి.

2. పౌడర్ 

అవుట్‌డోర్‌ లేదా ఏసీ లేని ప్రదేశాలకు వెళుతుంటే ముఖంపై పౌడర్ రాయండి. ఇలా చేయడం వల్ల చర్మంపై జిట్టు చేరదు. మీరు ఎండలోకి వెళ్లినా ఆ ప్రభావం తక్కువగా ముఖంపై తక్కువగా పడుతుంది.  మీకు చెమట పట్టినా మీ మేకప్ చెడిపోదు.

3. కంటి అలంకరణ

మీరు BB క్రీమ్ లేదా లేతరంగు గల మాయిశ్చరైజర్ క్రిములను మేకప్ కోసం ఉపయోగిస్తున్నారా. అయితే మొదటగా పౌడర్ రాసి, ఆ తర్వాత మేకప్ సెట్ చేసుకోండి.ఇది మీ కంటి అలంకరణను పాడుచేయదు.

4. కాజల్

ఈ సీజన్ ప్రకారం వాటర్ ప్రూఫ్ కాజల్ ఉపయోగించండి. ఇది మీ కాజల్ చెమటతో కలిసిపోకుండా ఉంటుంది. అయితే ప్రతి సీజన్‌కు వాటర్‌ప్రూఫ్ కాజల్ ఉత్తమ ఎంపిక.

5. లూస్ పౌడర్

చెమట వల్ల మేకప్ లుక్ చెడిపోకుండా చూసుకోవడానికి లూజ్ పౌడర్ అప్లై చేయడం ముఖ్యం. అయితే ఇది చెమటను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది.

Also Read : హీట్‌స్ట్రోక్ అంటే ఏమిటి.. దీని వల్ల ప్రాణాలు పోతాయా?

6. మేకప్ సెట్టింగ్ స్ప్రే

మేకప్ ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటు సెట్టింగ్ స్ప్రేని కూడా కొనుగోలు చేయండి. ఇది మేకప్‌ను సెట్ చేస్తుంది. ఫంక్షన్‌లో మీ లుక్ చెడిపోకుండా చేస్తుంది. ఈ పద్ధతులను అవలంబించడం ద్వారా వేసవిలో కూడా మీ మేకప్ ను ఎక్కువ కాలం అలాగే ఉంచుకోవచ్చు.

Disclaimer : ఈ కథనాన్ని చర్మ నిపుణులు సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని అవగాహనగా మాత్రమే భావించండి.

Tags

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×