BigTV English
Advertisement

Tillu Square Collected Rs 100 Crores: రెండేళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడు టిల్లుగాడు చేశాడు.. ఇది కదా డెడికేషన్ అంటే!

Tillu Square Collected Rs 100 Crores: రెండేళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడు టిల్లుగాడు చేశాడు.. ఇది కదా డెడికేషన్ అంటే!
Siddhu Jonnalagadda
Siddhu Jonnalagadda

Siddu Jonnalagadda’s Tillu Square Movie Crossed Rs 100 Crores Collections: టిల్లు గాడు చెప్పిందే చేశాడు భయ్యా. గత రెండేళ్ల క్రితం విడుదలైన ‘డీజే టిల్లు’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే అప్పుడు ఓ ఇంటర్వ్యూలో అతడు చెప్పిన మాటలు.. ఇప్పుడు నిజం చేసి చూపించాడు. అయితే మరి టిల్లు గాడు చెప్పిన ఆ మాటలేంటో.. ఆ మాటలను ఇప్పుడెలా నిజం చేశాడో అనే విషయానికొస్తే..


సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. మొదట్నుంచి ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేయగా.. ట్రైలర్‌తో మరింత బజ్‌ను రాబట్టారు. దీంతో సినీ ప్రియులు థియేటర్లకు పరుగులు పెట్టారు.

మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని దుమ్ముదులిపేసింది. ఫస్ట్ డే రూ.28 కోట్ల గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే డీజే టిల్లు మంచి హిట్ కావడంతో టిల్లు స్క్వేర్ ఫుల్ హైప్‌తో వచ్చి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అందువల్లనే థియేటర్లు కాలీ లేకుండా అయిపోయాయి.


Also Read: ఏనుగుకి స్నానం చేస్తున్న రామ్ చరణ్.. పక్కనే కూతురు క్లింకార.. ఫొటో చూశారా?

అంతేకాకుండా ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న నాగవంశీ కూడా టిల్లు స్క్వేర్ రిలీజ్‌కు ముందే ఈ మూవీ 100 కోట్లు కొల్లగొడుతుందని చెప్పాడు. ఇప్పుడు అదే జరిగింది. ఈ మూవీ తొమ్మిది రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అబ్బురపరచింది. దీంతో నిర్మాతలకు లాభాల పంట పండించింది. మొత్తంగా ఈ మూవీ రూ.101.4 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

అయితే ఇప్పుడు సిద్దు డెడికేషన్‌కు సంబంధించి ఓ వార్త గట్టిగా వినిపిస్తోంది. అతడు రెండేళ్ల క్రితమే ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రానున్న మూడేళ్లలో తాను రూ.100 కోట్లు కలెక్ట్ చేసే స్టార్ అవ్వాలని చెప్పాడు. ఆ డెడికేషన్‌తోనే అతడు బాగా కష్టపడి ప్రేక్షకుల్ని అలరించి ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీతో రూ.100 కోట్లు క్రాస్ చేసి చూపించాడు.

Also Read: Dhanush Divorce: బ్రేకింగ్.. ఐశ్వర్య రజినీకాంత్ తో ధనుష్ విడాకులు..

దీంతో సిద్దు అభిమానులు సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నాడు. అట్లుందని మన టిల్లుగాని తోని అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ సక్సెస్ మీట్ ఏప్రిల్ 8న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిదిగా హాజరుకాబోతున్నాడు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×