BigTV English
Advertisement

Trolls on Virat Kohli’s 100: 9 బాల్స్ కే ట్రోల్ చేస్తారా..? విరాట్ – బట్లర్ సెంచరీల్లో తేడా!

Trolls on Virat Kohli’s 100: 9 బాల్స్ కే ట్రోల్ చేస్తారా..? విరాట్ – బట్లర్ సెంచరీల్లో తేడా!
Trolls on Virat Kohli During the Rajasthan Royals Match
Trolls on Virat Kohli During the Rajasthan Royals Match

Trolls on Virat Kohli’s Hundred in IPL 2024 against RR: ఆర్సీబీ వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ క్రమంలో తాజాగా రాజస్తాన్ రాయల్స్ తో  జరిగిన మ్యాచ్ లో రెండు జట్ల నుంచి ఇద్దరు ఆటగాళ్లు చేసిన రెండు సెంచరీలు నెట్టింట పెద్ద సెగ పుట్టిస్తున్నాయి. ఓడిపోయిన జట్టు ఆర్సీబీ నుంచి విరాట్ కొహ్లీ 67 బంతుల్లో సెంచరీ చేసి జట్టు స్కోరుని 183 పరుగులకు తీసుకెళ్లాడు.


అంతవరకు బాగానే ఉంది. కానీ లక్ష్య ఛేదనలో దిగిన రాజస్తాన్ రాయల్స్ నుంచి జాస్ బట్లర్ 58 బాల్స్ లో సెంచరీ చేసి మ్యాచ్ ని గెలిపించాడు. ఒకరి సెంచరీతో ఓడిపోతే, ఒకరి సెంచరీ గెలిపించిదని ట్రోలింగ్ లు మొదలయ్యాయి. విరాట్ కూడా తక్కువ బాల్స్ లో సెంచరీ చేసి ఉంటే ఎంత బాగుండేదని ట్రోల్ చేస్తున్నారు. తను సెంచరీ కోసం, రికార్డుల కోసం ఆడాడని ట్రోలింగ్ మొదలు పెట్టారు.

ఈ క్రమంలో విరాట్ ని సపోర్ట్ చేసేవారు కూడా ట్రోలర్స్ కి ధీటుగా బదులిస్తున్నారు. విరాట్ కొహ్లీ ఒక్కడే ఆర్సీబీ జట్టులో ఆడుతున్నాడు. మిగిలిన వారెవ్వరు కూడా అతనికి సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇప్పటికి ఆడిన 5 మ్యాచ్ ల్లో విరాట్ 146 స్ట్రయిక్ రేట్ తో 316 పరుగులు చేశాడు. నిజానికి ప్రస్తుతం ఐపీఎల్ మొత్తం పది జట్లలో తనే టాప్ లో ఉన్నాడు. అతన్ని నిందించడం సంస్కారం కాదని ఘాటుగానే విమర్శిస్తున్నారు.


Also Read: నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్

ఐపీఎల్ ప్రారంభమయ్యాక కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కొహ్లీ 59 బాల్స్ లో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు. చెన్నయ్ తో జరిగిన మ్యాచ్ లో 21, లక్నోతో జరిగిన మ్యాచ్ లో 22 పరుగులు చేశాడు. ఇప్పుడు తాజగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

తను ఆడిన 5 మ్యాచ్ ల్లో రెండు తప్ప, అన్నింటా అద్భుతంగా పెర్ ఫార్మ్ చేస్తా ఉంటే, విరాట్ ని ఆడిపోసుకోవడానికి మీకు మనసెలా వచ్చిందని విరాట్ అభిమానులు ఎదురుదాడి చేస్తున్నారు. ఆడలేక మద్దెల దరువు అన్నట్టు ఆడలేనోళ్లని ఏమీ అనకుండా, ఆడేవాళ్లని పట్టుకుని ట్రోల్ చేయడం సరైనది కాదని, అది విరాట్ ని మానసికంగా కుంగదీస్తే, రేపటి మ్యాచ్ ల్లో ప్రభావం చూపిస్తుందని, అది జట్టుకి ప్రమాదకరమని అంటున్నారు.

Also Read: Romario Shepherd: ముంబైని గెలిపించిన వీరుడు.. రొమారియో షెఫర్డ్

ఒక ఎండ్ నుంచి తను ఆడుతున్నప్పుడు తర్వాత ఎండ్ లో ఉన్నవాళ్లు సపోర్ట్ చేయాలని అంటున్నారు. తను సెంచరీ చేయడమే పాపమైపోయిందని అంటున్నారు. మరోవైపు విరాట్ ఐపీఎల్ లో 8 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే 7,579 పరుగులు దాటాడు. దీంతో అత్యధిక సెంచరీలతో, అత్యధిక పరుగులతో నెంబర్ వన్ గా ఉన్నాడు.

అలాంటివాడ్ని అంటే, అది క్రికెట్ కే అవమానమని, ఆట తెలియని వాళ్లు అనేమాటని అంటున్నారు. కొందరు సెన్సేషన్ కోసం చేసేదాన్ని ఇలా పట్టుకుని విజ్నులైన వాళ్లు వేలాడటం సరైంది కాదని మరికొందరు విమర్శిస్తున్నారు.

Tags

Related News

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Big Stories

×