BigTV English

Winter Precautions for Children : చలికాలంలో పిల్లల పట్ల ఈ జాగ్రత్తలు తీసుకోండి

Winter Precautions for Children  : చలికాలంలో పిల్లల పట్ల ఈ జాగ్రత్తలు తీసుకోండి
Winter Precautions for Children

Winter Precautions for Children : చలికాలం చిన్న పిల్లలపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఎన్నో రకాల వైరస్‌లు వారిపై దాడి చేస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మీ పిల్లలను సురక్షితంగా సురక్షితంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. చలికాలంలోనే ఎక్కువగా జ్వరం, జలుబు, గొంతు నొప్పి, చెవి నొప్పి లాంటి సమస్యలను పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే మీ పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఎప్పుడు పిల్లలను వెచ్చగా ఉంచడానికి ప్రయత్నించాలి. చలికాలంలో పిల్లల శరీర ఉష్ణోగ్రతను కాపాడడానికి టోపీలు, సాక్స్, తేలికపాటి స్వెటర్లు, జాకెట్లు లాంటివి వేయాలి. బయట ఉష్ణోగ్రత ఎంత చల్లగా ఉందో దాన్ని బట్టి శిశువు తల, చాతిని సురక్షితంగా కప్పి ఉంచాలి. అదేవిధంగా శీతాకాలంలో పిల్లల కోసం ఎప్పుడు ప్యాంట్లు వేయాలి. తీపి పదార్థాలను వారికి దూరంగా ఉంచాలి. ఎక్కువగా తీవ పదార్థాలు తింటే జలుబు, జ్వరం తొందరగా వస్తాయి. అంతేకాకుండా చలికాలంలో అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి ఈ సీజన్లో రోగ నిరోధక శక్తి అంతగా ఉంచుకోవడం పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా అవసరం. దీనికోసం ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, కొన్ని మసాలా దినుసులు ఇవ్వాలి. అంతేకాకుండా పిల్లలకు తగినంత నిద్రపోయేందుకు అవకాశం కల్పించాలి. ప్రతి ఒక్కరికి నిద్ర చాలా ముఖ్యం. పిల్లలకైతే ఇది మరీ ముఖ్యమైనది. ఎందుకంటే తగినంత నిద్ర రోగ నిరోధక శక్తి వ్యవస్థ పై సానుకూల ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి బలపడి శరీరాన్ని బలహీన పరుస్తుంది. అంతేకాకుండా చలికాలం భోజనం తర్వాత పిల్లల ఆరోగ్యంలో శారీరక శ్రమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే చల్లటి వాతావరణం నెలకొనే ముందు ప్రతిరోజు సాయంత్రం అరగంట పాటు బహిరంగ మైదానంలో లేదా పార్కులో ఆడుకోవడానికి పిల్లలను తీసుకెళ్లాలి. పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి అంటే తినడానికి ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడగాలి. అలాగే పరిసరాలు వస్తువులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.


Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×