
Upcoming Movies : దసరా పండుగ పూర్తయిపోయింది.. ఇక రెండు నెలల్లో ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. అయితే ఇంకా సినిమాల యుద్ధం మాత్రం ముగియలేదు. బాక్స్ ఆఫీస్ వార్ ఈ రెండు నెలలోనే ఉంటుందా అని అనిపిస్తుంది. మామూలుగా పండక్కి సందడి చేయకుండా ఆగిన నాలుగు భారీ సినిమాలు ఈ 60 రోజుల్లో బరిలోకి దిగుతున్నాయి. ఇక థియేటర్లు షేక్ అవ్వాల్సిందే.. బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవాల్సిందే. ఎందుకంటే ఈ మూవీల సత్తా అలాంటిది.. అయితే నిజంగా ఈ మూవీలోకి అంత సత్తా ఉంది అంటారా?
ఈ రెండు నెలల్లో సందడి చేయడానికి వస్తున్న ఆ నాలుగు చిత్రాలు ఏమిటో తెలుసా.. ప్రభాస్ సలార్,సల్లు బాయ్ టైగర్ 3, రణబీర్ కపూర్ యానిమల్, షారుక్ డుంకీ.. ఇవన్నీ బాలీవుడ్ చిత్రాలే కదా అనుకొని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బాక్స్ ఆఫీస్ మనీ మెషిన్.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన మూవీ టైగర్ 3, పైగా ఇది ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ ఫ్రాన్సిస్ అయిన టైగర్ సీక్వెల్ గా వస్తున్న చిత్రం. ముఖ్యంగా కత్రినా కైఫ్ ఈ మూవీకి సెంటిమెంటల్ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. పేరుకి బాలీవుడ్ చిత్రం అయినా మన థియేటర్లలో కూడా ఈ మూవీ బాగా సందడి చేస్తుంది. పైగా సల్మాన్ సినిమా క్లిక్ అయిందంటే రెండు రోజులకే 100 కోట్ల కలెక్షన్స్ దాటే అవకాశం ఉంటుంది.
ఇక తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ.. డుంకీ. పఠాన్,జవాన్, లాంటి వరుస హిట్ లతో దూసుకుపోతున్న షారుక్.. ఓటమి తెలియని రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ డుంకీ. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం సంచలనం సృష్టిస్తే మాత్రం థియేటర్లు వనకాల్సిందే. ఈ సంవత్సరం బ్రహ్మాండమైన బిజినెస్ చేసుకున్న షారుక్ ఇయర్ ఎండింగ్ ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు. మంచి బ్లాక్ బస్టర్ తో ఈ సంవత్సరానికి అసలు సిసలైన ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి అన్న జోరు మీద ఉన్నాడు. అయితే ఇప్పటికే గత రెండు చిత్రాల్లో భారీ యాక్షన్ ఓరియంటెడ్ హీరోగా షారూక్ ని చూసిన ఆడియన్స్ డుంకీలో షారుక్ చేస్తున్న క్యారెక్టర్ ను యాక్సెప్ట్ చేయగలరా అనే విషయంపై ఈ మూవీ సక్సెస్ పూర్తిగా ఆధారపడి ఉంది. పైగా దీనికి పోటీగా నిలబడుతుంది ప్రభాస్ సలార్.
మాంచి ఊర మాస్ మసాలా కాన్సెప్ట్ తో వస్తున్న సలార్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక షారుక్ మూవీ కష్టాల్లో పడ్డట్టే.
ప్రస్తుతం బాక్సాఫీస్ డైనోసార్ గా పిలవబడే సలార్ నిజంగా ఆ రేంజ్ లో క్లిక్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఆదిపురుష్ ఇచ్చిన హైప్ కి వచ్చిన రిజల్ట్ కి పొంతన లేకపోవడంతో ఈ చిత్రంపై కూడా అక్కడక్కడ అనుమానాలు మిగిలి ఉన్నాయి.కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.
కంటెంట్ క్లిక్ అయితే ఈ మూవీని ఆపడం ఎవరికీ కుదరదు కానీ ఒకవేళ క్లిక్ కాకపోతే అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఇక ఈ పోటీలో ఉన్న మరొక చిత్రం యానిమల్, రణబీర్
కపూర్, రష్మీక కాంబో లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ సంచలనం సృష్టించే సత్తా గలిగిన మూవీ అని మార్కెట్ టాక్. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్, పోస్టర్, సాంగ్స్ మాంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వేయికోట్ల క్లబ్లో చేరే అన్ని అవకాశాలు ఉన్నాయి మూవీ క్లిక్ అవుతుందా లేదా చూడాలి. ఇలా రాబోయే రెండు నెలలు ఈ నాలుగు భారీ బడ్జెట్ సినిమాలతో భారీ అంచనాల మధ్య థియేటర్ల పై దాడికి వస్తున్నాయి. మరి వీటిలో ఏది భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటాయో చూడాలి.