BigTV English

Tips For Men: అబ్బాయిలూ.. ‘పడక గది’లో చతికిల పడుతున్నారా? ఈ ఫుడ్స్‌కు కాస్త దూరంగా ఉండండి బాస్!

Tips For Men: అబ్బాయిలూ.. ‘పడక గది’లో చతికిల పడుతున్నారా? ఈ ఫుడ్స్‌కు కాస్త దూరంగా ఉండండి బాస్!

ఈ రోజుల్లో చాలా మంది పని ఒత్తిడితో పాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా శృంగారంపై ఆసక్తిని కోల్పోతున్నారు. టెన్షన్ లైఫ్ లో కాసేపు బెడ్ మీద రిలాక్స్ అవుదామనుకున్నా కాలేకపోతున్నారు. లైంగిక ఆసక్తిని తగ్గించడంలో కొన్ని ఆహార పదార్థాలు కీలక పాత్ర పోషిస్తున్నాయంటున్నారు నిపుణులు. కొన్ని ఫుడ్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


1. కూల్ డ్రింక్స్

లైంగిక సామర్థ్యాన్ని తగ్గించడంలో కూల్ డ్రింక్స్ కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు సెరోటోనన్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తక్కువ సెరోటోనిస్ ఉత్పత్తికి కారణమై లైంగిక ఆసక్తిని దెబ్బతీస్తాయి


2. ఆల్కహాల్ 

అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. హార్మోన్ల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆల్కహాల్  కామోద్దీపనలను బలహీనపరుస్తుంది. అంగస్తంభన సమస్యలకు కారణం అవుతుంది. మహిళ్లలోనూ శృంగార ఆసక్తిని తగ్గిస్తుంది.

3. ప్రాసెస్డ్ ఫుడ్స్

కుక్కీలు, బిస్కెట్ల లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ప్రాసెసింగ్ ఫుడ్ లైంగిక కోరికను ప్రోత్సహించే అన్ని పోషకాల తొలగిస్తుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్ లోని సింథటిక్ హార్మోన్లు లైంగిక శక్తితో పాటు శరీరానికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

4. ట్రాన్స్ ఫ్యాట్స్

మైదా, ట్రాన్స్ ఫ్యాట్స్ ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బ తీస్తాయి. ఈ ఫ్యాట్స్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. లైంగిక అవయవాలకు కూడా రక్త ప్రసరణ నిలిచిపోయేలా చేస్తాయి. ఫలితంగా లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

5. చక్కెర

చక్కెర శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. రక్తంలో చేరిన షుగర్ లైంగిక హార్మోన్లను నియంత్రించే జన్యువులపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేకాదు, ప్రొటీన్ స్థాయి తగ్గించి లైంగిక హార్మోన్లు అయిన టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఫలింతా లైంగిక ఆసక్తి తగ్గుతుంది.

6. ప్లాస్టిక్ బాటిళ్లు   

ప్లాస్టిక్ బాటిల్స్ లోని బిస్ ఫినాల్ ఎ (బిపిఎ) అనే కెమికల్ ఉంటుంది. ఇది పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. తక్కువ స్పెర్మ్ కౌంట్, ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది.

7. కాఫీ

కాఫీ మానసిక ఉత్తేజాన్ని కలిగించినప్పటికీ, లైంగిక శక్తిని తగ్గిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కెఫీన్ లైంగిక హార్మోన్ల సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది.

8. చాక్లెట్లు

చాక్లెట్ల విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. డార్క్ చాక్లెట్లు లైంగిక శక్తిని పెంచుతాయని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయినా, టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ముదురు రంగులో ఉన్న చాక్లెట్‌లను తినేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. లైట్ కలర్ చాక్లెట్ల లోని సమ్మేళనాలు లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తాయంటున్నారు.

చక్కటి లైంగిక సంతోషాన్ని పొందేందుకు తాజా కూరగాయాలు, పండ్లు, నట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మునగ లాంటి కూరగాయలు లైంగిక శక్తిని పెంచుతాయంటున్నారు. బేకరీ ఫుడ్స్ మానేసి, పెరటి కూరలు తీసుకోవడం మంచిదంటున్నారు.

Read Also: నిరుద్యోగులకు ఉచితంగా ‘వెయిట్ లాస్’ టీకాలు.. యూకేలో కొత్త పథకం, వాళ్లకే ఎందుకు?

Related News

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Big Stories

×