Anti Aging Foods: వయస్సు కంటే ముందే ముసలివారిలాగా కనిపించాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి ? కానీ నేటి మారుతున్న జీవనశైలిలో భాగంగా.. మన శారీరక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తరచుగా మన చర్మం కూడా అనేక రకాల నష్టాలను ఎదుర్కుంటోంది. అయితే.. ఇలాంటి సమయంలోనే మనం సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను డైట్‌లో చేర్చడం వంటివి చేయాలి. ఈ చిన్న మార్పులు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
చర్మ సమస్యలను ఎదుర్కోవడం కొన్నిసార్లు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ పరిష్కారం మన అంతర్గత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మాత్రమే ఉంటుంది.
మన చర్మ ఆరోగ్యం పూర్తిగా మన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. చర్మంపై ముడతలు, సన్నని గీతలను నివారించడానికి.. మీ రోజువారీ ఆహారంలో బాదం, పెరుగు, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తినడం మంచిది. మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ,అందంగా ఉంచుకోవడానికి మీరు ఏ ఆహారాలు తప్పకుండా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం:
ప్రతి రోజు బాదం తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E చర్మం యొక్క రంగు, ఆకృతిని కాపాడుకోవడానికి చాలా బాగా సహాయపడతాయి.విటమిన్ ఇ చర్మానికి పోషణ ఇవ్వడమే కాకుండా వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా నానబెట్టిన బాదంపప్పును స్నాక్‌గా క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అంతే కాకుండా సూర్య కిరణాల వల్ల కలిగే నష్టం నుండి కూడా ఇది రక్షిస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవడానికి మీ పోషకాలు అధికంగా ఉండే ఆహారంలో బాదం పప్పును కలపడం సులభమైన, ప్రభావవంతమైన మార్గం.
సాల్మన్ చేప:
చర్మ ఆరోగ్యానికి సాల్మన్ చేప కూడా అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో.. మృదువుగా తయారు చేయడంలో సహాయపడతాయి. ఒమేగా-3లు చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా చర్మానికి దృఢత్వం, స్థితిస్థాపకతను అందిస్తాయి. ఇది ముడతలు,మొఖంపై గీతలను తగ్గిస్తుంది.
చిలగడదుంపలు:
చిలగడదుంపలలో విటమిన్లు E, C వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ చర్మ కణాలను పునర్నిర్మించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మానికి అనుకూలమైన ఆహారంగా మారుతుంది.
సిట్రస్ పండ్లు:
నారింజ, బెర్రీలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మం యొక్క స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి కొల్లాజెన్ చాలా అవసరం. వయసు పెరిగే కొద్దీ దాని స్థాయిలు సహజంగా తగ్గుతాయి. ఇలావంటి పరిస్థితిలో.. సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా ఇది ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా.. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి కూడా రక్షిస్తాయి.
Also Read: హార్మోన్ల అసమతుల్యతకు కారణాలు.. తినాల్సిన పదార్థాలు !
పెరుగు:
చర్మ సంరక్షణలో పెరుగు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లాక్టిక్ ఆమ్లం, విటమిన్లు B2, B6, B12 వంటి పోషకాలకు మంచి మూలం. లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని శుభ్రంగా , తాజాగా ఉంచి, చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. పెరుగులో ఉండే విటమిన్లు చర్మాన్ని బిగుతుగా చేసి లోపలి నుండి పోషణనిస్తాయి. తద్వారా చర్మం యొక్క సహజ మెరుపును కాపాడుతుంది.