E-Paper
Advertisement

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఏపీ రూట్ ఓకే.. మరి బ్రేక్ ఎక్కడ పడింది?

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఏపీ రూట్ ఓకే.. మరి బ్రేక్ ఎక్కడ పడింది?
Advertisement

Bullet Train: బుల్లెట్ రైల్.. ట్రాక్‌పై దూసుకెళ్లే వేగం మాత్రమే కాదు.. మూడు ప్రధాన నగరాలను కలిపే మెగా కనెక్టివిటీ. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు సుమారు 760 కిలోమీటర్ల హైస్పీడ్ కారిడార్‌కు ప్లాన్ రెడీ అయ్యింది. ఇందులో 518 కిలోమీటర్ల ట్రాక్ ఏపీలోనే ఉండబోతోంది. ఈ రూట్ అలైన్‌మెంట్‌కు క్లియరెన్స్ లభించడంతో పనులు స్పీడ్ అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి దగ్గర ఏపీలోకి ఎంట్రీ ఇచ్చే ఈ హైస్పీడ్ ట్రైన్.. అమరావతి, గుంటూరు మీదుగా దూసుకెళ్లనుంది.

విజయవాడకు బిగ్ రిలీఫ్..

Advertisement

ఈ కారిడార్‌లో విజయవాడకు బిగ్ రిలీఫ్ దక్కింది. క్యాపిటల్ రీజియన్‌తో పాటు బెజవాడ, గుంటూరు సిటీలకు ఫాస్ట్ కనెక్టివిటీ ఉండేలా.. విజయవాడకు కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే అమరావతి స్టేషన్ నిర్మించాలని డిసైడ్ చేశారు. అక్కడి నుంచి కోస్టల్ బెల్ట్ మీదుగా చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు టచ్ చేస్తూ.. చివరగా తిరుపతి మీదుగా చెన్నైకి ఈ బుల్లెట్ ట్రైన్ రయ్ మంటూ పరుగులు తీయనుంది.

తెలంగాణ అలైన్‌మెంట్‌పై వీడని సస్పెన్స్!

Advertisement

అయితే, ఏపీ రూట్ క్లియర్ అయినా.. తెలంగాణ వైపు అలైన్‌మెంట్‌పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఫైనల్ సర్వే, డీపీఆర్ ప్రాసెస్‌కు టెంపరరీ బ్రేక్ పడింది. అటు తిరుపతి–చిత్తూరు లింక్ కూడా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ప్రైమరీ అప్రూవల్ రావడం ఫస్ట్ స్టెప్ మాత్రమే.. ఫైనల్ అప్రూవల్, ఫండ్స్ రిలీజ్ అయి ట్రాక్ పనులు పట్టాలెక్కితేనే, ఏపీ గ్రోత్‌కు ఈ బుల్లెట్ రైల్ అసలైన బూస్ట్ ఇస్తుంది. ఇదంతా మొదలవ్వాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.

Also Read: ముంబై పార్కులో యువజంటపై మైనర్ల దాడి.. 8 మంది అదుపులోకి, వీడియో వైరల్

Tags

Related News

పెళ్లిరోజు రాత్రి మహారాణికి జరిగిన అవమానం..ఉదయ్‌పూర్ ‘రూఠీ రాణి మహల్’ ఆసక్తికర కథ

కిటికీలో నుంచి చూస్తే స్వర్గమే.. జీవింతంలో ఒక్కసారైన చూడాల్సిన 5 అద్భుతమైన రైలు మార్గాలు!

రాత్రి అయితే చాలు.. ఈ ప్రదేశాలు మరో ప్రపంచంలా మారిపోతాయి!

రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు? దీని వెనుక మ్యాజిక్ ఏంటి? ఓతూరి తెలుసుకుంటే పోలా!

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు.. ఇంజిన్ ఒక ఊరిలో, చివరి బోగి మరో ఊరిలో.. ఎన్ని కి.మీ అంటే?

భారతీయులకు ఫ్రీ ఎంట్రీ రద్దు.. వీసా రూల్స్ మార్చేసిన మలేసియా.. కారణం ఏంటంటే?

రైల్వే గ్రూప్ బుకింగ్ రూల్స్ ఛేంజ్.. ఇక ఎన్ని బెర్తులైనా బుక్ చేసుకోవచ్చా?

Big Stories

Advertisement
×