బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పర్ఫెక్ట్ లంచ్ అంటే ఏంటి? మీ శరీరానికి రోజంతా ఎనర్జీనిచ్చే హెల్తీ ఫుడ్

పర్ఫెక్ట్ లంచ్ అంటే ఏంటి? మీ శరీరానికి రోజంతా ఎనర్జీనిచ్చే హెల్తీ  ఫుడ్

Healthy Lunch Options: మన రోజువారీ ఆహారంలో మధ్యాహ్న భోజనం అత్యంత కీలకమైనది. ఉదయం ఆఫీసు లేదా పనుల హడావిడిలో బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా చేయకపోయినా, మధ్యాహ్నం తినే లంచ్ మన శరీరానికి చాలా అవసరం. అయితే.. చాలా మంది మధ్యాహ్నం అనగానే కేవలం వైట్ రైస్, ఏదో ఒక కూరతో కడుపు నింపేస్తుంటారు. కానీ దీని వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రొటీన్లు అందవు సరే కదా.. తిన్న కాసేపటికే విపరీతమైన బద్ధకం, నిద్ర వచ్చేస్తుంటాయి. మరి రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటూ.. పూర్తి పోషకాలు అందాలంటే మన లంచ్ ప్లేట్ ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలతో పర్ఫెక్ట్ లంచ్ ప్లేట్ ఎలా ఉండాలి?
ఒక ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్ , గుడ్ ఫ్యాట్స్ అన్నీ సమానంగా బ్యాలెన్స్ అవ్వాలి. అప్పుడే మన మెటబాలిజం బాగుంటుంది. మీ లంచ్ ప్లేట్‌లో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోండి.

1. కార్బోహైడ్రేట్లు-క్వాంటిటీ తగ్గించండి:
మనం లంచ్‌లో ఎక్కువగా వైట్ రైస్ తింటాం. అన్నం తినడం తప్పు కాదు, కానీ దాని పరిమాణం తక్కువగా ఉండాలి. వీలైతే వైట్ రైస్ ప్లేస్‌లో బ్రౌన్ రైస్, కొర్రలు లేదా జొన్న రొట్టెలను చేర్చుకుంటే చాలా మంచిది. ఇవి శరీరానికి నెమ్మదిగా గ్లూకోజ్‌ను అందిస్తాయి. దీనివల్ల తిన్న వెంటనే నిద్ర రాదు.

2. ప్రొటీన్లు:
మన లంచ్ ప్లేట్‌లో కనీసం పావు భాగం ప్రొటీన్ ఫుడ్ ఉండాలి. మీరు వెజిటేరియన్ అయితే పప్పులు, పనీర్, సోయాబీన్, లేదా రాజ్మా వంటివి తీసుకోవచ్చు. నాన్-వెజిటేరియన్స్ అయితే.. ఉడికించిన గుడ్లు లేదా స్కిన్‌లెస్ చికెన్ బ్రెస్ట్ తినొచ్చు. ప్రొటీన్ వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది, క్రేవింగ్స్ తగ్గుతాయి.

3. ఫైబర్, విటమిన్లు:
భోజనంలో ఒక కప్పు ఖచ్చితంగా ఆకుకూర లేదా ఏదైనా ఒక కూరగాయల ఇగురు/పులుసు ఉండేలా చూసుకోండి. వారంలో కనీసం మూడు సార్లు తోటకూర, పాలకూర లాంటివి తినడం వల్ల ఐరన్ బాగా అందుతుంది. అలాగే భోజనానికి ముందు ఒక చిన్న ప్లేట్ కీరదోస, క్యారెట్, టమాటోలతో కూడిన పచ్చి సలాడ్ తినడం వల్ల శరీరానికి బోలెడంత ఫైబర్ అందుతుంది.

లంచ్‌లో మర్చిపోకూడని రెండు సూపర్ ఫుడ్స్:
పెరుగు లేదా మజ్జిగ: మధ్యాహ్న భోజనం ముగింపులో పెరుగు లేదా పల్చటి మజ్జిగ ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఎండ వేడికి శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి.

గుడ్ ఫ్యాట్స్: కూరల్లో వాడే నూనె చాలా తక్కువగా ఉండాలి. నెయ్యి ఇష్టపడేవారు అర చెంచా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని అన్నంలో వేసుకోవచ్చు, ఇది విటమిన్ల శోషణకు హెల్ప్ అవుతుంది.

లంచ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
టీవీ,ఫోన్లు చూడటం: భోజనం చేసేటప్పుడు మొబైల్స్ చూస్తే.. మనం ఎంత తింటున్నామో మైండ్‌కు తెలియదు. దీని వల్ల ఓవర్ ఈటింగ్ జరుగుతుంది.

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం: తిన్న వెంటనే.. లీటర్ల కొద్దీ నీళ్లు తాగితే జీర్ణ రసాలు పల్చబడి అరుగుదల మందగిస్తుంది. భోజనానికి అరగంట ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెస్ట్ హాబిట్.

ఆరోగ్యం అనేది మనం తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న భోజనాన్ని కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా.. శరీరానికి పోషకాలను అందించే ఒక ఇంధనంలా భావించండి. పైన చెప్పిన విధంగా రైస్ క్వాంటిటీ తగ్గించి, పప్పు, కూరలు, పెరుగు ఎక్కువగా ఉండేలా.. మీ లంచ్ ప్లేట్‌ను ప్లాన్ చేసుకోండి. ఈ చిన్న మార్పు మీ లైఫ్‌స్టైల్‌ను, మీ హెల్త్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.

Related News

స్మార్ట్‌వాచ్ వాడుతున్నారా? ఫిట్‌నెస్ ట్రాకర్ల వెనక ఉన్న షాకింగ్ నష్టాలు తెలుసా!

క్షణంలో నవ్వు.. మరుక్షణంలో చిరాకు! మహిళల్లో వచ్చే ఈ మార్పులకు కారణం ఇదే!

షుగర్ పేషెంట్లకు వరం లాంటి పండ్లు.. ఇక స్వీట్ క్రేవింగ్స్‌కు గుడ్ బై

గ్లాసెస్ తీసేస్తే.. ముక్కుపై నల్ల మరకలు కనిపిస్తున్నాయా?

టాయిలెట్ క్లీనింగ్‌కు ఈ ఒక్కటి చాలు..15 నిమిషాల్లో గారపట్టిన మరకలన్నీ క్లీన్!

గర్భవతి మహిళలు మ్యాగీ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? డాక్టర్ ఏం చెప్పారంటే

టీ ఎక్కువసేపు మరిగి చేదుగా మారిందా? రుచి సరి చేయడానికి సింపుల్ టిప్స్

×