E-Paper
Advertisement

క్షణంలో నవ్వు.. మరుక్షణంలో చిరాకు! మహిళల్లో వచ్చే ఈ మార్పులకు కారణం ఇదే!

క్షణంలో నవ్వు.. మరుక్షణంలో చిరాకు! మహిళల్లో వచ్చే ఈ  మార్పులకు కారణం ఇదే!
Advertisement

Women Mood Swings Reasons: కొంత మంది మహిళల్లో మనం తరచూ చూస్తుంటాం.. అప్పటివరకు చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతారు. కానీ అంతలోనే చిన్న విషయానికే విపరీతమైన చిరాకు, కోపం లేదా ఏడుపు తెచ్చేసుకుంటారు. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో ‘మూడ్ స్వింగ్స్’ అంటారు. చాలా మంది పురుషులు ఇది కేవలం నాటకం అనుకుంటారు. కానీ నిజానికి మహిళల శరీరంలో అంతర్గతంగా జరిగే కొన్ని మార్పుల వల్లే ఈ భావోద్వేగ మార్పులు వస్తాయి. అసలు మహిళల మూడ్స్ అంత ఫాస్ట్‌గా మారడానికి గల సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళల్లో మూడ్ స్వింగ్స్:

మహిళల జీవితంలో ప్రతి నెలా, ప్రతి దశలోనూ అనేక శారీరక మార్పులు జరుగుతుంటాయి. పురుషులతో పోలిస్తే స్త్రీల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చే భావోద్వేగ మార్పులకు ప్రధాన కారణాలు ఇవే..

Advertisement

1. పీరియడ్స్ కి ముందు వచ్చే పీఎమ్ఎస్ (PMS):
పీరియడ్స్ రావడానికి వారం లేదా పది రోజుల ముందు మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. దీన్ని ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ సమయంలో మెదడులోని ‘సెరోటోనిన్’ (ఆనందాన్ని ఇచ్చే రసాయనం) స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల కారణం లేకుండానే విపరీతమైన చిరాకు,కోపం,నీరసం, ఏడవాలనిపించడం వంటివి జరుగుతాయి.

2. గర్భధారణ సమయం :
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరం ఒక పెద్ద హార్మోన్ల ఫ్యాక్టరీలా మారుతుంది. పుట్టబోయే బిడ్డ కోసం శరీరం సిద్ధమయ్యే క్రమంలో హార్మోన్లు విపరీతంగా పైకి, కిందకు మారుతుంటాయి. దీని వల్ల మొదటి మూడు నెలలు , డెలివరీ తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసట ఎదురవుతాయి.

Advertisement

3. మెనోపాజ్ దశ:
45 నుంచి 50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మహిళల్లో పీరియడ్స్ ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి శాశ్వతంగా తగ్గిపోతుంది. దీని వల్ల రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం , ఉన్నట్టుండి ఒంట్లో సెగలు రావడం, తీవ్రమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి.

ఇతర కారణాలు:
ఈ రోజుల్లో మహిళలు ఇటు ఇల్లు, అటు ఆఫీస్ పనులతో డబుల్ బాధ్యతలు మోస్తున్నారు.

నిద్రలేమి: సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెదడు అలసిపోయి చిరాకు పెరుగుతుంది.

ఎక్కువ స్ట్రెస్: నిరంతరం మానసిక ఒత్తిడికి గురవడం వల్ల ‘కార్టిసోల్’ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలై మూడ్స్ పూర్తిగా మారిపోతాయి.

మూడ్ స్వింగ్స్‌ను కంట్రోల్ చేయడం ఎలా?
మహిళల్లో వచ్చే ఈ మార్పులను కొన్ని లైఫ్‌స్టైల్ మార్పుల ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

హెల్తీ డైట్: జంక్ ఫుడ్స్ తగ్గించి ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.

చిన్నపాటి వ్యాయామం: రోజుకు 20 నిమిషాలు వాకింగ్, యోగా లేదా మెడిటేషన్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలై మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఫ్యామిలీ సపోర్ట్: అన్నింటికంటే ముఖ్యంగా ఇంట్లో ఉండే భర్త లేదా కుటుంబ సభ్యులు ఈ సమయంలో వారిని అర్థం చేసుకుని సపోర్ట్‌గా నిలబడితే ఎలాంటి మూడ్ స్వింగ్స్ అయినా ఈజీగా దాటేయవచ్చు.

మహిళల్లో వచ్చే భావోద్వేగ మార్పులు పూర్తిగా సహజమైనవి. ఇది వారు కావాలని చేసేది కాదు.వారి శరీరం లోపల జరిగే హార్మోన్ల యుద్ధం వల్ల వచ్చే మార్పు. కాబట్టి స్త్రీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో పాటు, భాగస్వామి కూడా వారిని ప్రేమగా చూసుకోవడం చాలా అవసరం. ఒకవేళ ఈ సమస్య మరీ తీవ్రంగా ఉండి, రోజు రీ జీవితాన్ని ఇబ్బంది పెడుతుంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

Related News

దోమలను చంపేందుకు కొత్త దోమలు.. 6 లక్షల స్పెషల్ దోమలు విడుదల

NEET Counselling: నీట్ 2026 కౌన్సిలింగ్.. ఎంబిబిఎస్ అడ్మిషన్ స్టేట్ కోటాకు మీకు అర్హత ఉందా?

తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ వెంటనే ఆకట్టుకుంటారు

టీనేజ్ పిల్లలతో స్నేహం చేసేందుకు కొత్త విధానం.. తల్లిదండ్రులు ఫాలో అవుతున్న న్యూ ట్రెండ్

మాటల్లేవ్, టిచింగ్ అసలే లేదు.. దంపతుల మధ్య ఈ 5 సంకేతాలు కనిపిస్తే సైలెంట్ డివోర్స్

ఆరోగ్యానికి సూచిక శరీర బరువు కాదు.. ఊబకాయం కొలిచేందుకు కొత్త ఫార్ములా

చేపల్లో వేగంగా వ్యాపించే అరుదైన క్యాన్సర్.. ఆందోళన వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు

సిగరెట్ అలవాటు లేకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్.. వైద్యులు చెబుతున్న అసలు కారణాలివే!

Big Stories

Advertisement
×