E-Paper
Advertisement

టీనేజ్ పిల్లలతో స్నేహం చేసేందుకు కొత్త విధానం.. తల్లిదండ్రులు ఫాలో అవుతున్న న్యూ ట్రెండ్

టీనేజ్ పిల్లలతో స్నేహం చేసేందుకు కొత్త విధానం.. తల్లిదండ్రులు ఫాలో అవుతున్న న్యూ ట్రెండ్
Advertisement

Teen Ternity| తరాలు మారుతున్న కొద్దీ పిల్లలను పెంచే విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు తల్లిదండ్రులు క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త పేరెంటింగ్ విధానాన్నే టీన్ టెర్నిటీ అని అంటున్నారు.

టీన్ టెర్నిటీ అనే పదం టీన్, టెర్నెటీ అనే రెండు పదాల కలయిక. దీని ఉద్దేశం టీనేజ్ సమయంలో పిల్లలతో బలమైన, దీర్ఘకాలిక భావోద్వేగ బంధాన్ని నిర్మించడం. ఈ విధానంలో తల్లిదండ్రులు పిల్లలను నియంత్రించడం కంటే వారిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

టీన్ – టెర్నిటీ అంటే ఏమిటి?

Advertisement

టీనేజ్ అనేది పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఈ సమయంలో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా అనేక మార్పులు జరుగుతాయి. పిల్లలు తమ వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తారు. అలాగే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా ప్రారంభిస్తారు.
ఈ సమయంలో ఎప్పుడూ మందలించడం లేదా కఠినమైన నియమాలు పెట్టడం వల్ల పిల్లలు తల్లిదండ్రులకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే టీన్ టెర్నిటీ ప్రకారం.. ప్రేమతో, ఓర్పుతో మార్గనిర్దేశం చేయాలి.

ఈ ట్రెండ్ ఎందుకు ప్రాచుర్యం పొందుతోంది?

ప్రస్తుతం పిల్లలు సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ ప్రపంచం మధ్య పెరుగుతున్నారు. వారు గత తరాలు ఎదుర్కోని కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల పిల్లలకు కేవలం ఆదేశాలు ఇవ్వడం సరిపోదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారి మాటలను వినడం, భావాలను అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు అండగా నిలవడం మరింత ముఖ్యమని గుర్తిస్తున్నారు.

స్నేహితుల్లా మెలగాలి, కానీ తల్లిదండ్రులుగానే ఉండాలి

Advertisement

పిల్లలతో స్నేహంగా ఉండటం మంచిదే. అయితే తల్లిదండ్రులు తమ బాధ్యతలను మరచిపోకూడదు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు సరైన హద్దులు కూడా ఉండాలి. క్రమశిక్షణ, బాధ్యత, గౌరవం వంటి విలువలను నేర్పించడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. ప్రేమతో కూడిన మార్గదర్శకత్వం బెస్ట్ పేరెంటింగ్‌గా భావిస్తారు.

పిల్లల మాటలను శ్రద్ధగా వినండి

చాలా సందర్భాల్లో పిల్లలు సలహా కోసం కాకుండా తమ మనసులోని మాట చెప్పడానికి వస్తారు. అలాంటి సమయంలో వారిని అడ్డుకోకుండా పూర్తిగా వినాలి. ఇలా చేయడం వల్ల నమ్మకం పెరుగుతుంది. పిల్లలు భవిష్యత్తులో కూడా తమ సమస్యలను తల్లిదండ్రులతో పంచుకోవడానికి ముందుకు వస్తారు.

వారి అభిరుచులను గౌరవించండి

ప్రతి తరం అభిరుచులు వేరుగా ఉంటాయి. సంగీతం, దుస్తులు, హాబీలు లేదా సాంకేతికత విషయంలో పిల్లల అభిప్రాయాలను వెంటనే తప్పుపట్టకండి. వారికి అవి ఎందుకు ఇష్టమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పరస్పర గౌరవం బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది.

కలిసి సమయం గడపండి

బిజీ జీవితంలో కుటుంబానికి సమయం కేటాయించడం చాలా అవసరం. కలిసి వంట చేయడం, వాకింగ్‌ కోసం వెళ్లడం, ఆటలు ఆడడం లేదా సినిమా చూడడం వంటి చిన్న చిన్న ప్రొగ్రామ్స్ కూడా సంబంధాన్ని బలపరుస్తాయి.
ఖరీదైన బహుమతుల కంటే కలిసి గడిపే సమయం పిల్లలకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.

Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించండి

పిల్లలు తప్పు చేసినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులతో మాట్లాడే ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటే పిల్లలు విషయాలను దాచడం ప్రారంభిస్తారు. ప్రశాంతంగా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపితే పిల్లల్లో నిజాయితీ, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

టీన్ టెర్నిటీ అనేది పిల్లలకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇవ్వడం కాదు. ప్రేమ, నమ్మకం, సంభాషణ మరియు సరైన మార్గదర్శకత్వంతో బలమైన కుటుంబ బంధాన్ని నిర్మించడం దీని ప్రధాన లక్ష్యం.

తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితులుగా, మార్గదర్శకులుగా, నమ్మకమైన వ్యక్తులుగా ఉంటే వారి మానసిక ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది.

Related News

తొలిసారి డేట్‌కు వెళుతున్నారా? సినిమా వెళ్లడం కంటే ఈ 7 పనులు చేయండి

భగవద్గీత.. సృష్టిలో కారణం లేకుండా ఏదీ జరగదు.. మరి ఇంత అన్యాయం ఎందుకు?

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. కేవలం 30 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది

వాకింగ్ చేసినా సరిపోదు.. ఈ రోజువారీ అలవాట్లతో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బరువు పెరుగుతున్నారా? ఇంట్లోనే ఈ 3 సింపుల్ వ్యాయామాలు చేయండి

కచ్చితమైన కొలతలతో మటన్ కచ్చి బిర్యానీ.. నోట్లో పెట్టగానే ముక్క వెన్నలా కరిగిపోద్ది!

గుమ్మడికాయ అంటే ఇష్టం లేనివాళ్లు కూడా ఈ హల్వాను లొట్టలేసుకుంటూ తింటారు!

బరువు తగ్గాలంటే రాత్రిపూట అన్నం మానేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×