Pimples: చాలా మందికి ముఖం నిండా మొటిమలు ఉంటాయి. దీని వల్ల చాలా ఇబ్బంది పడతారు. వీటిని తగ్గించుకోవడానికి ఎన్ని క్రీంలు వాడినా కొన్ని సార్లు ఎలాంటి లాభం ఉండదు. ఇవి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయట. అవి ఏంటంటే..
చర్మంలో ఉండే సెబాషియస్ అనే గ్లాంగ్ నుంచి అధిక ఆయిల్ ఉత్పత్తి కావడం వల్ల సెబం వస్తుందట. ఇది చర్మంలో ఉండే రంద్రాల్లో చిక్కినప్పుడు మొటిమలు వస్తాయట. డెడ్ స్కిన్ సెల్స్ చర్మకణాల పోరలలోకి వెళ్లడం వల్ల కూడా మొటిమలు వస్తాయని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.
తీసుకునే ఆహారంలో షుగర్, ఫ్యాట్ ఎక్కువగా ఉంటే కూడా మొటిమలకు కారణమవుతాయి. కొంతమంది చాక్లెట్ లేదా ఫాస్ట్ ఫుడ్ వంటివి తినగానే మొటిమలు వచ్చి పడతాయి. ఒత్తిడి పెరిగినప్పుడు, ఆహార మార్పులు, నిద్రలేమి, హార్మోనల్ ఇంబాలన్స్ కారణంగా మొటిమలు రావచ్చు.
మొటిమలను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు:
మృదువైన, చర్మానికి సురక్షితమైన సబ్బులు, క్లిన్జర్స్ ఉపయోగించడం వల్ల మొటిమలు తగ్గిపోతాయట. రోజుకు రెండు సార్లు ముఖం చల్లటి నీటితో కడగాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు టోనర్ వాడితే మంచి ఫలితం ఉంటుంది.
ALSO READ: చియా సీడ్స్ VS సబ్జా సీడ్స్
తాజా పండ్లు, కూరగాయలు, నీరు ఎక్కువగా తీసుకుంటే మొటిమలు తగ్గిపోతాయట. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉండే ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి తగ్గడానికి ప్రాణాయామం, వ్యాయామం, యోగా అలవాటు చేసుకుంటే మంచిది. కొన్నిసార్లు ఏం చేసినా మొటిమలు తగ్గిపోవు, అలాంటి పమయలంలో డెర్మటాలజిస్టును కలిస్తే ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.