BigTV English

CSK VS DC: 15 ఏళ్ల తర్వాత చెన్నై పై ఢిల్లీ తొలి విజయం..!

CSK VS DC: 15 ఏళ్ల తర్వాత చెన్నై పై ఢిల్లీ తొలి విజయం..!

CSK VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో దారుణమైన ఓటమిని చవిచూసింది. ఇవాళ సొంత గడ్డపై దారుణంగా ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇవ్వరా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ మ్యాచ్ లో అన్ని రంగాల్లో విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్….ఢిల్లీ చేతిలో 25 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ దెబ్బకు సొంత గడ్డపైన 15 సంవత్సరాల తర్వాత ఢిల్లీ చేతిలో ఓడిపోయిన.. చెత్త రికార్డు నమోదు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.


Also Read: SRH: పెద్దమ్మతల్లి గెలిపించమ్మా..జూబ్లీహిల్స్ లో SRH ప్లేయర్లు !

వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో… ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. మొత్తం నాలుగు మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ టీం… రెండు పాయింట్లు దక్కించుకొని పాయింట్స్ టేబుల్ లో 8వ స్థానంలో నిలిచింది. అలాగే మైనస్ రన్ రేట్లో… చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతోంది.

15 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ…

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన చెపాక్ స్టేడియంలో… 15 సంవత్సరాల తర్వాత విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇవాళ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్… 2010 సంవత్సరం తర్వాత విజయాన్ని నమోదు చేసుకుంది. 2010 సంవత్సరంలో ఇదే చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కానీ ఇవాళ చెన్నైని చిత్తు చేసి విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్.

Also Read: Tilak Varma: తిలక్ వర్మ వివాదం… రిటైర్డ్ హర్ట్.. రిటైర్డ్ ఔట్ తేడాలివే?

17 ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విక్టరీ

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాడ్ టైం నడుస్తోంది. మొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 17 ఏళ్ల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది బెంగళూరు. చెపాక్ స్టేడియంలో 2008 సంవత్సరంలో.. చెన్నై పై బెంగళూరు విజయం సాధించింది. ఇక మొన్న జరిగిన మ్యాచ్లో 17 సంవత్సరాల తర్వాత చెన్నైని చిత్తు చేసింది బెంగళూరు.

పాయింట్స్ టేబుల్ లో దుమ్ము లేపిన ఢిల్లీ క్యాపిటల్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదర గొడుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి వచ్చేసింది. మూడు మ్యాచ్లు గెలవడంతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో పంజాబ్ రెండవ స్థానానికి పడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. చివర్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×