BigTV English

OTT Movie : సైలెంట్ అమ్మాయి వైలెంట్ గా మారితే … అడ్డొచ్చిన అందరికీ చుక్కలు చూపించింది

OTT Movie : సైలెంట్ అమ్మాయి వైలెంట్ గా మారితే … అడ్డొచ్చిన అందరికీ చుక్కలు చూపించింది

OTT Movie : హాలీవుడ్ సినిమాలకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే ఈ సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీలో సైలెంట్ గా ఉండే అమ్మాయిని వైలెంట్ గా మారుస్తారు. ఆ అమ్మాయికి సూపర్ పవర్ ఉండడంతో, స్టోరీ మరో లెవల్ కి వెళ్ళిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సూపర్ నేచురల్ హారర్ మూవీ పేరు ‘క్యారీ’ (Carrie). 2013 లో వచ్చిన ఈ మూవీకి కింబర్లీ పియర్స్ దర్శకత్వం వహించారు. 1976 లో స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో టెలికైనసిస్ (మనస్సుతో వస్తువులను కదిలించే శక్తి) ఉన్న ఒక యువతి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీలో క్లోయ్ గ్రేస్ మోరెట్జ్, జూలియాన్ మూర్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2013, అక్టోబర్ 18న యునైటెడ్ స్టేట్స్‌లో మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ పిక్చర్స్ ద్వారా విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

క్యారీ వైట్ విద్యార్థికి మొహమాటం ఎక్కువగానే ఉంటుంది. ఆమె తన తల్లి మార్గరెట్ వైట్ తో కలిసి ఉంటుంది. ఆమె ఒక మతోన్మాది మరియు కఠినమైన మహిళ గా ఉంటుంది. అందువల్ల మార్గరెట్ తన కూతురిని చాలా నియంత్రణలో ఉంచుతుంది. ఆమెను ప్రపంచం నుండి చాలా విషయాలకు దూరంగా ఉంచుతుంది. ఆమెకు పాపాల గురించి,శిక్షల గురించి చెప్పి భయపెడుతూ ఉంటుంది. ఇలా పెరగడం వలన స్కూల్ లో, క్యారీ తన సహవిద్యార్థులచే ఎగతాళికి గురవుతుంది. ఒక రోజు, ఆమెకు మొదటి సారి మూడు రోజుల సమస్య వస్తుంది. కానీ దాని గురించి ఆమెకు ఏమీ తెలియదు. ఎందుకంటే ఆమె తల్లి ఆమెకు దాని గురించి ఎప్పుడూ చెప్పి ఉండదు. అది చూసి భయపడిన క్యారీ గట్టిగా అరుస్తుంది. కానీ ఆమె సహవిద్యార్థులు ఆమెను ఎగతాళి చేయడమే కాకుండా, ఆ ఘటనను వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తారు. ఇది క్యారీ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తుంది. ఈ సంఘటన తర్వాత, క్యారీ తనలో కొన్ని శక్తులు ఉన్నాయని తెలుసుకుంటుంది. ఆమె ఈ శక్తులను నియంత్రించడం, ఉపయోగించడం నేర్చుకుంటుంది.

ఇదిలా ఉండగా, ఆమెను ఎగతాళి చేసిన విద్యార్థులలో ఒకరైన సూ ఎల్లెన్ తన తప్పును గ్రహించి, క్యారీని పాఠశాలలో జరిగే డాన్స్ పోటీలకు తీసుకెళ్లమని తన బాయ్‌ఫ్రెండ్ టామీని కోరుతుంది. అయితే మరో విద్యార్థిని క్రిస్ క్యారీ పట్ల పగ పెంచుకుని, ఆ పోటీలో ఆమెను అవమానించాలని పథకం వేస్తుంది. ఆ పోటీలలో ఆమె క్వీన్ గా నిలుస్తుంది. కానీ ఇదంతా క్రిస్ రూపొందించిన ఒక కుట్రలో భాగం అని తెలుస్తుంది. అదే సమయంలో క్యారీ పైన అందరి ముందు పంది రక్తాన్ని పోసి అవమాణిస్తారు. ఇక క్యారీ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆమె తన తన శక్తులను ఉపయోగించి ప్రామ్ హాల్‌ను నాశనం చేస్తుంది. అక్కడ ఉన్నవారిని హతమారుస్తుంది. క్యారీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమెను తల్లి పాపాత్మురాలుగా భావించి చంపాలని ప్రయత్నిస్తుంది. చివరికి క్యారీ తన శక్తులతో తల్లిని కూడా చంపుతుందా ? లేకపోతే తానే చనిపోతుందా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×