ఆధునిక కాలంలో అబ్బాయిల్లో గడ్డం పెంచుకునే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొంతమంది మాత్రమే క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నారు. మిగతా వారంతా గడ్డంతోనే కనిపిస్తున్నారు. ఇలా గడ్డం పెంచుకున్న అబ్బాయిలు… అమ్మాయిలకు అందంగా కనిపిస్తారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
కొత్త అధ్యయనం ప్రకారం గడ్డం పెంచుకున్న పురుషుల మనస్తత్వం భిన్నంగా ఉంటుందని, అలాంటివారిని నమ్మవచ్చని అమ్మాయిల్లో భావిస్తూ ఉంటారు. క్లీన్ షేవ్‌తో పోలిస్తే గెడ్డం ఉన్న పురుషులు కొత్త భాగస్వాముల కోసం వెతకరని తనకు ఉన్న భాగస్వామితోనే జీవించడానికి ఇష్టపడతారని ఈ అధ్యయనంలో తేలింది. కానీ క్లీన్ షేవ్ చేసుకున్న పురుషులు ఎక్కువమంది భాగస్వాములను కలిగి ఉండే అవకాశం ఉంటుందని పరిశోధన తెలిసింది. అందుకే అమ్మాయిల్లో క్లీన్ షేవ్ బదులుగా గడ్డం పెంచుకున్న భయం ఇష్టపడడానికి ముందుంటారు.
గడ్డం పెంచుకున్న అబ్బాయిల గురించి మహిళలు ఏమనుకుంటున్నారో అలాగే క్లీన్ షేవ్ చేసుకున్న వారి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. దాదాపు 8,500 మంది మహిళలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వే యూరోప్, అమెరికా దేశాల్లో జరిగింది. ఈ సర్వేలో మహిళలు తాము చేసుకోబోయే భర్తకు గెడ్డం ఉండాలని కోరుకుంటున్నట్టు తేలింది.
అలాగే కొన్ని నివేదికల ప్రకారం గెడ్డం పెంచుకున్న మనిషి పరిపక్వతను కలిగి ఉంటాడని సామాజికంగా మంచి స్థాయిలో ఉంటాడని అమ్మాయిలు భావిస్తూ ఉంటారు. పరిశుభ్రమైన గడ్డంతో ఉన్న ముఖం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందని కూడా ఈ అధ్యయనం చెబుతుంది. క్వీన్స్ విద్యాలయం 2016లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం పొడవాటి గడ్డాలు ఉన్న పురుషులు అనుబంధాన్ని దీర్ఘంగా ఉండేలా కాపాడుకుంటారు. అలాగే నమ్మకంతో ఆనందాన్ని కొనసాగిస్తారు. అందుకే అమ్మాయిలు ఎక్కువగా గడ్డం ఉన్నప్పుడు ఆకర్షితులవుతూ ఉంటారు.
మరొక అధ్యయనంలో గడ్డం ఉన్న పురుషులు రిలేషన్ షిప్ లో చాలా రొమాంటిక్ గా ఉంటారని తేలింది. అధ్యయనం ప్రకారం గడ్డాలు పెంచుకునే పురుషులు తమ జీవిత భాగస్వామి సంతోష పెట్టేందుకే ఎక్కువగా చూస్తారని కూడా పరిశోధకులు చెబుతున్నారు. వారు అనుబంధాలకు విలువిస్తారని కూడా అంటున్నారు. ఈ అధ్యాయంలో 18 నుండి 40 సంవత్సరాల మధ్య గల 400కు పైగా పురుషులు పాల్గొన్నారు.
Also Read: పెళ్లయిన పురుషులు ఈ 4 రకాల స్త్రీలకు దూరంగా ఉండాలి, లేకుంటే…
మరొక అధ్యయనం ప్రకారం గడ్డం పెంచుకునే పురుషులు ఎవరన్నా కూడా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఆ గడ్డాన్ని గ్రూమింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గడ్డం పెంచడం వల్ల రేడియేషన్ కిరణాలు చర్మంపై పడకుండా జాగ్రత్త కూడా పడవచ్చు. గడ్డలు పెంచుకోవడానికి ఇష్టపడే పురుషులు ఫ్యామిలీ మ్యాన్ లా ఉండడానికి ఇష్టపడతారు. రిలేషన్ షిప్ లో రొమాంటిక్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.