E-Paper
Advertisement

సోషల్ మీడియా పోస్టులు చూసి ‘నా లైఫ్ ఎందుకిలా ఉంది?’ అని బాధపడుతున్నారా? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే!

సోషల్ మీడియా పోస్టులు చూసి ‘నా లైఫ్ ఎందుకిలా ఉంది?’ అని బాధపడుతున్నారా? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే!
Advertisement

Social Media Psychology: సాధారణంగా ఉదయం నిద్రలేవగానే ఫోన్ చేతిలోకి తీసుకుని ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే చాలు.. ఒకరు కొత్త కారు కొన్నారని, మరొకరు ఫారిన్ ట్రిప్ వెళ్లారని, ఇంకొకరు తమ పార్ట్‌నర్‌తో ఎంతో హ్యాపీగా ఉన్నారని ఫోటోలు కనిపిస్తుంటాయి. అవి చూసిన వెంటనే కొందరికి తెలియకుండానే మనసులో ఏదో వెలితి మొదలవుతుంది. అరె, నేను ఇంకా బస్సుల్లోనే తిరుగుతున్నానే.., నా లైఫ్‌లో మాత్రం గొడవలే ఎక్కువగా ఉన్నాయే.. అని చాలామంది లోలోపల బాధపడుతుంటారు. ఇతరుల జీవితాలను చూసి తమ లైఫ్ చాలా చిన్నదిగా, అసంపూర్ణంగా అనిపించడం వెనుక ఉన్న సైకాలజీ గురించి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా రష్మీ ఓ వీడియో ద్వారా ఆసక్తికర విషయాలు వివరించారు.

అసలు ఎందుకిలా అనిపిస్తుంది?

సోషల్ మీడియాలో ఇతరుల పోస్టులు చూసినప్పుడు మనల్ని మనం వాళ్లతో పోల్చుకోవడం మొదలుపెడతాం. సైకాలజీ భాషలో దీనిని ‘అప్‌వర్డ్ సోషల్ కంపారిజన్’ అంటారు. అంటే మనకంటే ఎక్కువ సక్సెస్ అయిన వాళ్లతో, అందంగా లేదా ధనవంతులుగా కనిపించే వాళ్లతో మనల్ని మనం పోల్చుకోవడం అన్నమాట. మన జీవితంలోని రోజువారీ కష్టాలను, ఇబ్బందులను ఎదుటివారి జీవితంలోని కేవలం బెస్ట్ మూమెంట్స్‌తో పోల్చడం వల్ల నిరాశ, అసంతృప్తి, అసూయ కలుగుతాయి. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది.

Advertisement

Also Read: కంటి పరీక్షల్లో అంతా నార్మల్.. కానీ చీకటి పడితే చూపు మందగిస్తోందా? కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు!

సోషల్ మీడియా వేరు.. రియల్ లైఫ్ వేరు:

సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అక్కడ అందరూ తమ జీవితంలోని ఫిల్టర్ చేసిన అందమైన భాగాన్ని మాత్రమే చూపిస్తారు. వారి వెనుక ఉన్న ఓటములు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు లేదా మానసిక ఒత్తిడిని ఎవరూ బయటపెట్టరు. తెర వెనుక కష్టాలను చూడకుండా కేవలం పైపై మెరుగులను చూసి మన జీవితం బాగోలేదని అనుకోవడం అస్సలు కరెక్ట్ కాదు.

మానసిక ఆరోగ్యం జాగ్రత్త:

Advertisement

రోజూ గంటల తరబడి ఫోన్ స్క్రోల్ చేస్తూ ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం వల్ల మనసు ప్రశాంతత కోల్పోతుంది. మనలో లోపాలు వెతుక్కోవడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే సోషల్ మీడియా వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.

ఏం చేస్తే బెటర్?

ఇతరులు ఏం సాధిస్తున్నారనే దానికంటే, మనం ఏం చేయగలమనే దానిపై ఫోకస్ పెట్టాలి. ఒకవేళ సోషల్ మీడియా ప్రభావం వల్ల మీ నిద్ర, మూడ్ లేదా రోజువారీ పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయని అనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానసిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Also Read: చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే సూపర్ డ్రింక్.. ఇంట్లోనే రుచికరమైన మునక్కాయ సూప్ ఇలా చేసుకోండి!

Tags

Related News

మీరు వాడే వాటర్ బాటిల్ మంచిదేనా.. FSSAI చెప్తున్న ఫ్యాక్ట్స్ ఇవే?

దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? బ్లడ్ గ్రూప్ మాత్రమే కాదు.. అసలు కారణాలివే!

జెన్ Z కొత్త ట్రెండ్ ‘క్రాష్ ఔట్’.. ఒక్కసారిగా సహనం కోల్పోతారు..

కర్ణాటక ఫేమస్ బిసిబెళె బాత్.. ఒక్కసారి తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!

సంతోషంగా జీవించాలంటే ఈ 3 అలవాట్లు వదిలేయండి.. భగవద్గీతలో అద్భుత శ్లోకం

రాగి బాటిల్ vs స్టీల్ బాటిల్.. రోజూవారీ వాడకానికి ఏది బెస్ట్? దేనివల్ల ఎక్కువ బెనిఫిట్స్?

ఆవిరిపై ఉడికే కమ్మని గుజరాతీ ఖమన్ డోక్లా.. చుక్క నూనె లేకుండా ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×