Madhya Pradesh: పెళ్లంటే ఒకప్పుడు ఇరు కుటుంబాలకు సంబంధించి ఏడేసి తరాలు చూసేవారు. వారి గురించి తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకునేవారు. దానివల్ల అప్పటి సంబంధాలు కలకాలం నిలిచివుండేవి.. ఇదంతా గతం మాట. ప్రస్తుతం ట్రెండ్ మారింది. అసలే పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మనసుకు నచ్చిన వాడ్ని ప్రేమించుకోవడం, దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్. ఫలితంగా తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రేమ వివాహం చేసుకుందని కూతురు బతికుండగానే అంత్యక్రియలు నిర్వహించారు ఆ తల్లిదండ్రులు.