RO Water: రోజూ మనం హెల్త్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మంచి ఫుడ్ తింటాం.. ఎక్సర్‌సైజ్‌లు చేస్తాం.. సరే మనం తిన్నా.. తినకపోయినా.. డైట్ చేసినా.. చేయకపోయినా అందరు తాగేది మాత్రం నీరు. మరి మనం రోజూ తాగే నీటి విషయంలో మాత్రం ఎంతమంది జాగ్రత్త పడుతున్నారు? ఇంట్లో RO వాటర్ తాగుతున్నాం కాబట్టి సేఫ్ అనుకుంటున్నారా? బయటకు వెళ్లినప్పుడు బిస్లరీ లాంటి బ్రాండెడ్ బాటిల్ కొంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని భావిస్తున్నారా? అయితే ఒక విషయం తెలుసుకోవాలి. ఖరీదైన నీరే మంచిదని కాదు. RO ద్వారా శుద్ధి చేసిన నీరే అత్యుత్తమమని కూడా కాదు. మరి బాటిల్ వాటర్ మంచిదా? ఇంట్లో RO వాటర్ మంచిదా? అసలు మన శరీరానికి ఎలాంటి నీరు అవసరం? ఈ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? తెలుసుకుందాం.
మన శరీరంలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం నుంచి జీర్ణక్రియ, రక్త ప్రసరణ, వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం వరకు ఎన్నో పనులకు నీరు అవసరం. అయితే మనం తాగే నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు, హానికరమైన రసాయనాలు ఉంటే మాత్రం అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కలుషిత నీటి వల్ల డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నీరు తాగుతున్నామా లేదా అనేదానికంటే.. ఎలాంటి నీరు తాగుతున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్.
చాలామంది ఇళ్లలో ఇప్పుడు RO వాటర్ ప్యూరిఫైయర్లు కనిపిస్తున్నాయి. నీటిలోని మలినాలను తొలగించడానికి RO అంటే రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ముఖ్యంగా నీటిలో కరిగి ఉన్న అధిక లవణాలు, కొన్ని హెవీ మెటల్స్, ఇతర అవసరం లేని హానికారక పదార్థాలను తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నీటిలో ఉండే చెడు పదార్థాలతో పాటు మన బాడీకి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా RO ప్రక్రియలో తగ్గిపోవచ్చు. అంటే RO వాటర్‌లో ఖనిజాలు అస్సలు ఉండవని కాదు. ఎంతవరకు తగ్గుతాయనేది మనం వాడే ప్యూరిఫైయర్, నీటి క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది. అందుకే RO వాటర్ తాగుతున్నవాళ్లు తమ ప్యూరిఫైయర్‌ను సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఫిల్టర్లను టైమ్‌కు మార్చాలి. నీటి క్వాలిటీని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి. అవసరమైతే రీమినరలైజేషన్ సదుపాయం ఉన్న ప్యూరిఫైయర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
బయటకు వెళ్లినప్పుడు చాలామంది బాటిల్ వాటర్ కొంటుంటారు. మాల్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్‌పోర్ట్స్, దాబా, హోటల్స్.. ఆఖరికి కిరాణా షాపుల్లో కూడా ఈజీగా దొరికేస్తాయి మనకు వాటర్ బాటిల్స్. ముఖ్యంగా బ్రాండెడ్ బాటిల్ కనిపిస్తే చాలు.. అది చాలా సేఫ్ అనే నమ్మకం మనది. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మనం సాధారణంగా మినరల్ వాటర్ అని పిలిచే బాటిళ్లలో చాలావరకు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. మినరల్ వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ రెండూ ఒకటి కాదు. ఏంటి ఈ రెండింటికి తేడా అంటారా? ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను వివిధ శుద్ధి ప్రక్రియల ద్వారా తాగడానికి అనువుగా తయారు చేస్తారు. నేచురల్ మినరల్ వాటర్ మాత్రం సహజమైన భూగర్భ నీటి వనరుల నుంచి తీసుకొని, నిర్దిష్ట ఖనిజ లక్షణాలను సెట్ చేస్తారు. అందుకే ప్రతి బాటిల్ వాటర్‌లో ఒకే రకమైన ఖనిజాలు ఉంటాయని చెప్పలేం.
Also read: రహస్యాల లీక్ ఎఫెక్ట్.. సైనికులకు 87 యాప్‌లు బ్యాన్.. ఇన్‌స్టా, ఎక్స్ పోస్టులపై నిషేధం!
మరో ముఖ్యమైన విషయం.. బాటిల్‌పై ఉన్న బ్రాండ్‌ను మాత్రమే చూసి కొనకూడదు. సీల్ సరిగ్గా ఉందా? తయారీ, ప్యాకేజింగ్ వివరాలు ఉన్నాయా? FSSAI లైసెన్స్ వివరాలు ఉన్నాయా? అనేది కూడా చూడాలి. అలాగే బాటిళ్లను ఎండలో, అధిక వేడి ఉండే ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉంచకూడదు. పెద్దవాళ్లు ఓకే. మరి పిల్లలకు ఏ నీరు ఇవ్వాలి? ఇది చాలామంది పేరెంట్స్‌కు వచ్చే ఓ డౌట్. పిల్లలకు ఖరీదైన మినరల్ వాటర్ కొనిచ్చినంత మాత్రాన ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అనుకోవడం సరికాదు. వారికి ఇచ్చే నీరు సూక్ష్మజీవులు, హానికరమైన కలుషితాలు లేకుండా ఉండాలి. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పాలు, ఆకుకూరలు, పప్పులు, ఇతర పోషకాహారం ద్వారా కూడా అందుతాయి. కాబట్టి బాటిల్ వాటర్ అయినా, RO వాటర్ అయినా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఉపయోగించవచ్చు.
అయితే ప్రతి ఇంటికీ RO అవసరమా అంటే.. కచ్చితంగా కాదనే చెప్పాలి. మీ ఇంటికి వచ్చే మున్సిపల్ వాటర్ క్వాలిటీగా ఉండి, నీటిలో హానికరమైన కలుషితాలు లేకపోతే RO అవసరం లేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సాధారణ ఫిల్టర్ లేదా UV వంటి శుద్ధి విధానాలు సరిపోవచ్చు. కానీ బోర్‌వెల్ నీటిలో అధిక లవణాలు, ఫ్లోరైడ్, నైట్రేట్లు లేదా ఇతర కలుషితాలు ఉంటే మాత్రం RO అవసరం అవుతుంది. ఏది వాడాలన్న.. ముందుగా మీ ఇంటి నీటి నాణ్యతను పరీక్షించుకుని, దానికి తగిన ప్యూరిఫికేషన్ విధానాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ రెండింటిలో ఏదో ఒకటి అందరికీ బెస్ట్ అని చెప్పలేం. మీరు తాగే నీటిలో హానికరమైన కలుషితాలు ఉండకూడదు. అవసరమైన ఖనిజాల సమతుల్యత కూడా ఉండాలి. నీటిని శుద్ధి చేయడంతో పాటు సరిగ్గా నిల్వ చేసుకోవడం కూడా ముఖ్యం. గుర్తుంచుకోండి.. నీరు ఎంత ఖరీదైనదనేది ముఖ్యం కాదు.. అది ఎంత సేఫ్ అనేదే ముఖ్యం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.. బిగ్‌టీవీని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇక లెటెస్ట్ అప్‌డేట్స్ కోసం బిగ్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
రోజూ మనం తాగే నీరు నిజంగా సురక్షితమేనా? ఇంట్లో RO వాటర్ తాగితే మంచిదా? బయట బ్రాండెడ్ బాటిల్ వాటర్ కొంటే మంచిదా? ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది? ఇది చాలా మందికి ఉండే డౌట్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. RO వాటర్‌లో నీటిలోని మలినాలతో పాటు కాల్షియం, మెగ్నీషియం వంటి సహజ ఖనిజాలు కూడా తగ్గిపోవచ్చు. అందుకే RO ప్యూరిఫైయర్‌ను సరిగ్గా నిర్వహించడం, అవసరమైతే రీమినరలైజేషన్ సదుపాయం ఉండేలా చూసుకోవడం ముఖ్యం. మరోవైపు బాటిల్ వాటర్ కూడా ఎప్పుడూ సురక్షితమేనని చెప్పలేం. బాటిల్ సీల్, తయారీ తేదీ, FSSAI లైసెన్స్ వివరాలు చెక్ చేయాలి.. ఎండలో ఎక్కువసేపు ఉంచిన బాటిళ్లను కొనకపోవడం మంచిది.
Also read: నెల్లూరు రేణిగుంట ఆలయంపై.. కాక రేపుతున్న రాజకీయం